✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tesla Model Y Car : టెస్లా మోడల్ Y కారు కాస్ట్ అమెరికాలో 32 లక్షలు, ఇండియాలో 60 లక్షల పైమాటే, అక్కడ కొని ఇక్కడికి తెచ్చుకుంటే?

Geddam Vijaya Madhuri   |  16 Jul 2025 01:06 PM (IST)
1

భారతదేశంలో టెస్లా మోడల్ Y ధర 60 లక్షల రూపాయల నుంచి ప్రారంభమై 68 లక్షల వరకు ఉంది. అదే అమెరికాలో ఈ కారు ధర 32 లక్షల రూపాయల వరకు ఉంది. దీనిని చూసి అమెరికాలో కొని దిగుమతి చేసుకుంటే బెస్ట్​ అనుకుంటున్నారా? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే.

2

ఎందుకంటే మీరు అమెరికాలో కారు కొన్నా సరే.. ఇండియాకి వచ్చిన తర్వాత దాని ధర రెట్టింపు అవుతుంది. పన్ను వ్యవస్థ, దిగుమతి సుంకాల వల్లే ఇది జరిగింది. భారతదేశంలో టెస్లా కార్లను CBU అంటే పూర్తిగా నిర్మించిన యూనిట్‌లుగా దిగుమతి చేస్తున్నారు.

3

దీని అర్థం ఏమిటంటే.. ఈ కార్లు పూర్తిగా విదేశాల్లోనే తయారవుతాయి. దీనిపై ప్రభుత్వం 70 శాతం నుంచి 100 శాతం వరకు దిగుమతి సుంకం విధిస్తుంది. వాస్తవానికి టెస్లా మోడల్ Y ధర 40,000 డాలర్ల కంటే ఎక్కువే. కాబట్టి 100% దిగుమతి సుంకం విధిస్తున్నారు.

4

టెస్లా ఇంకా లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ గురించి ఎలాంటి అధికారిక లేదా ఫార్మల్ ప్రకటన చేయలేదు. ప్రస్తుతం టెస్లా షోరూమ్ ముంబైలో ప్రారంభించారు. త్వరలో ఢిల్లీలో కూడా తెరిచేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.

5

ఎవరైనా అమెరికా నుంచి టెస్లా Y మోడల్ కొని భారతదేశానికి తీసుకువస్తే అది చౌకగా ఉంటుందని భావిస్తే అది సరికాదు. అమెరికా నుంచి టెస్లా ఈ మోడల్​ను కొనుగోలు చేసి తీసుకురావడంపై ప్రభుత్వం అనేక రకాల పన్నులు విధిస్తుంది.

6

కాబట్టి భారతదేశానికి తీసుకువచ్చేసరికి ఈ కారు ఇక్కడ అమ్ముడవుతున్నంత ధరకే వస్తుంది. అమెరికాలో కొని అక్కడ నడిపేందుకు కొనుగోలు చేస్తే అది 32 లక్షలే కానీ ఇండియాకు వస్తే ధర రెట్టింపు అవుతుంది.

7

టెస్లా మోడల్ Y భారతదేశంలో ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ రియర్ సీట్లు, వెనుక సీటు కోసం ప్రత్యేక టచ్‌స్క్రీన్ వంటివి అందించింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • న్యూస్
  • Tesla Model Y Car : టెస్లా మోడల్ Y కారు కాస్ట్ అమెరికాలో 32 లక్షలు, ఇండియాలో 60 లక్షల పైమాటే, అక్కడ కొని ఇక్కడికి తెచ్చుకుంటే?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.