INS Vikrant: ఇండియన్ నేవీలోకి INS విక్రాంత్, కమిషన్ చేసిన ప్రధాని మోదీ
దేశీయ పరిజ్ఞానంతో తయారైన INS విక్రాంత్‌ను ప్రధాని మోదీ అధికారికంగా నేవీకి అందించారు.
పూర్తి దేశీయంగా తయారైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ IAC విక్రాంత్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
ఈ క్యారియర్ నిర్మాణానికి రూ.20 వేల కోట్లు ఖర్చైంది. ఇందుకోసం శ్రమించిన ఇంజనీర్లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
ఇండియన్ నేవీకి ఈ క్యారియర్ కొత్త బలాన్ని, నమ్మకాన్ని ఇస్తుందని, ఇదో చరిత్రాత్మక దినమని పీఎం మోదీ అన్నారు.
ఇండియన్ నేవీ చరిత్రలో ఇంత భారీ స్థాయి క్యారియర్ కమిషన్ కావడం ఇదే తొలిసారి.
భారత నైపుణ్యాలు, ప్రతిభకు INS విక్రాంత్ నిదర్శనమని పీఎం మోదీ ప్రశంసలు కురిపించారు.
ఇదే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఇండియన్ నేవీ కొత్త జెండా నిషాన్‌ను ఆవిష్కరించారు.
ఎలాంటి కఠిన లక్ష్యం అయినా భారత్ అధిగమించగలదు అనటానికి INS విక్రాంత్ ఓ ఉదాహరణ అని మోదీ కొనియాడారు. (All Images Credits: ANI)