✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

India Defence Capital: డిఫెన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు, దాని స్పెషాలిటీ ఏంటి..

Shankar Dukanam   |  23 Dec 2025 04:08 PM (IST)
1

భారత సైన్యం కోసం పలు రాష్ట్రాల్లో ఆయుధాలు తయారవుతాయి. అయితే అత్యధిక ఆయుధాలు ఏ రాష్ట్రంలో తయారు చేస్తారు. భారతదేశంలో రక్షణ ఉత్పత్తి ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశ సైనిక అవసరాలను తీర్చడానికి అనేక రాష్ట్రాల్లో ఆయుధ కర్మాగారాలు, ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు, ప్రైవేట్ డిఫెన్స్ పరిశ్రమలు చురుకుగా ఉన్నాయి.

Continues below advertisement
2

భారతదేశ డిఫెన్స్ శక్తి పలు రాష్ట్రాలపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం వేగంగా రక్షణ ఉత్పత్తికి ఉత్తర ప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. కాన్పూర్ లోని ఫీల్డ్ గన్ ఫ్యాక్టరీ చాలా కాలంగా సైన్యం కోసం తొపాకులు, మందుగుండు సామగ్రిని తయారు చేస్తోంది.

Continues below advertisement
3

లక్నో, అలీగఢ్, ఝాన్సీ, చిత్రకూట్ వంటి ప్రాంతాలు కలిసి ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి అవుతోంది. లక్నోలో బ్రహ్మోస్ మిసైల్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం యూపీని మరింత ముందుకు నడుపుతోంది.

4

భారత సైన్యం యొక్క ఆయుధాల తయారీలో మహారాష్ట్ర ఒక ముఖ్యమైన భాగం. నాగపూర్ దగ్గర పుల్గావ్లో దేశంలోనే అతిపెద్ద ఆయుధాల డిపో ఉందని తెలిసిందే. ఇక్కడ సైన్యం ఆయుధాలు, మందుగుండు సామగ్రి యొక్క భారీ నిల్వ ఉంచుతోంది. దీనితో పాటు రాష్ట్రంలో అనేక ఆయుధ కర్మాగారాలు, రక్షణ పరికరాలను తయారు చేసే యూనిట్లు ఉన్నాయి. ఇవి సైన్యం లాజిస్టిక్స్, సప్లై చైన్‌ను బలపరుస్తాయి.

5

దక్షిణ భారతదేశ రక్షణ కారిడార్‌కు ప్రధాన రాష్ట్రంగా తమిళనాడు ఉంది. ఇక్కడ సాయుధ వాహనాలు, మందుగుండు సామగ్రి, అనేక మెషినరీ వ్యవస్థలు తయారు అవుతున్నాయి. చెన్నై, దాని పరిసర ప్రాంతాలలో రక్షణ ఉత్పత్తికి సంబంధించిన అనేక ప్రభుత్వ, ప్రైవేట్ యూనిట్లు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. దీని వలన దక్షిణ భారతదేశం సైతం భారత సైన్యం ఆయుధాల తయారీలో కీలకపాత్ర పోషిస్తుంది.

6

భారత మిస్సైల్, ఏరోస్పేస్ తయారీ కేంద్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. హైదరాబాద్‌లో మిస్సైల్ వ్యవస్థలు, రాడార్లు, అధునాతన రక్షణ సాంకేతికత అభివృద్ధి చేస్తరు. ఇక్కడి కంపెనీలు DRDO, భారత సైన్యం కోసం అత్యాధునిక వ్యవస్థలను రూపొందిస్తున్నాయి. ఇవి మోడ్రన్ వార్ అవసరాలను తీరుస్తాయి.

7

భారతదేశ రక్షణ రాజధాని, రీసెర్చ్, సాంకేతిక పరిజ్ఞానం పరంగా చూస్తే, కర్ణాటకలోని బెంగళూరు ముందుంది. ఇక్కడ HAL, DRDO ల్యాబ్‌లు, రక్షణ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఉన్నాయి. యుద్ధ విమానాలు, ఏవియానిక్స్, డ్రోన్‌లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌ల అభివృద్ధి చేస్తున్న కారణంగా బెంగళూరును భారతదేశ ఏరోస్పేస్ రాజధాని అని కూడా పిలుస్తారు.

8

భారత సైన్యం కోసం అత్యధిక ఆయుధాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తయారవుతున్నాయి. బెంగళూరు రీసెర్చ్, టెక్నాలజీకి కేంద్రంగా ఉండగా, లక్నో ఆయుధాల కొత్త ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ వైవిధ్యం భారత్ ఆత్మనిర్భర రక్షణ శక్తిగా మారుస్తుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఇండియా
  • India Defence Capital: డిఫెన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు, దాని స్పెషాలిటీ ఏంటి..
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.