Droupadi Murmu Visits Sabarimala: శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Shankar Dukanam | 22 Oct 2025 03:36 PM (IST)
1
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలోని ప్రముఖ శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. బుధవారం (అక్టోబర్ 22) ఉదయం 11:50 గంటలకు సన్నిధానంలో అయ్యప్ప స్వామికి రాష్ట్రపతి ముర్ము ప్రార్థనలు చేశారు.
2
1970లలో డాలీలో మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఆయన తరువాత శబరిమల ఈ మందిరాన్ని సందర్శించిన రెండవ భారత రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు.
3
పతనంతిట్టలోని ప్రమద స్టేడియంలో ఉదయం ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్ కుంగిపోయింది. అదృష్టవశాత్తూ రాష్ట్రపతి ముర్ముకు ఏం కాలేదని అధికారులు తెలిపారు.
4
బుధవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక కాన్వాయ్‌లో పంబకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పంపా నదిలో పాదాలు కడుక్కుని, గణపతి మందిరంతో పాటు అక్కడి దేవాలయాలను సదర్శించారు.