Indian Army Day 2022 Photos: సైనికా.. నీకు వందనం.. ఘనంగా భారత ఆర్మీ డే సెలబ్రేషన్స్, మాటలు చాలవన్న ప్రధాని మోదీ
భారతదేశ ఆర్మీ చరిత్రలో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది జనవరి 15న భారత ఆర్మీ డే నిర్వహించుకుంటున్నాం. (Photos Credit: Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In App1947లో భారత్ స్వాతంత్య్రం సాధించుకున్నా ఆర్మీ అధికారాలు మాత్రం మన చేతికి రాలేదు. 1949లో భారత్ చేతికి ఆర్మీ పగ్గాలు జనవరి 15న వచ్చాయి. (Photos Credit: Twitter)
బ్రిటీష్ చివరి ఆర్మీ జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత లెఫ్టినెంట్ జనరల్ కేఎం కరియప్ప ఇదే తేదీన ఆర్మీ బాధ్యతలు స్వీకరించారు. దాంతో ఆర్మీకి సైతం పూర్తి స్వేచ్చ, భారత్‌కు పరిపూర్ణ హక్కులు లభించాయి. (Photos Credit: Twitter)
స్వాతంత్య్రం కోసం, అనంతరం సైతం దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తున్న సైనికుల ప్రాధాన్యతను సైతం భావితరాలకు చాటి చెప్పేందుకు జనవరి 15న ప్రతి ఏడాది ఆర్మీ డే నిర్వహించుకుంటున్నాం. (Photos Credit: Twitter)
న్యూఢిల్లీలోని మాజీ లెఫ్టినెంట్ జనరల్, ఆర్మీ చీప్ కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఆర్మీ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. (Photos Credit: Twitter)
ఆర్మీ డే సందర్భంగా వీర సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత కోసం భారత సైన్యం చేస్తున్న అమూల్యమైన సేవల్ని మాటల ద్వారా వ్యక్తం చేయలేం అన్నారు. (Photos Credit: Twitter)
శత్రువులు దేశంలోకి చొచ్చుకొచ్చే కఠినమైన ప్రాంతాల్లో భారతీయ ఆర్మీ సిబ్బంది శ్రమిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, మానవ సంబంధ సంక్షోభ పరిస్థితులను ఎదుక్కొంటూ దేశానికి రక్షణ అందించడంలో ముందంజలో ఉన్నారని సైనికుల సేవలపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిసించారు. (Photos Credit: Twitter)
నేషనల్ ఆర్మీ డేను పురస్కరించుకుని.. ఆర్మీ జనరల్ ఎంఎం నరవాణే, అడ్మైరల్ ఆర్ హరి కుమార్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరులైన సైనికులను నివాళులర్పించారు. (Photos Credit: Twitter)
నేషనల్ ఆర్మీ డే 2022 సందర్భంగా దేశ ప్రజలు అమర జవాన్లను స్మరించుకుంటున్నారు. తమ కోసం దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతున్న వీర సైనికుల ధైర్య సాహసాలను కొనియాడుతూ వారికి విషెస్ తెలుపుతున్నారు. (Photos Credit: Twitter)
నేషనల్ ఆర్మీ డే 2022 (Photos Credit: Twitter)
నేషనల్ ఆర్మీ డే 2022 (Photos Credit: Twitter)