Happy Independence Day 2025: స్వాతంత్య్రం వచ్చే నాటికి రూపాయికి ఏం కొనగలిగేవారు? బంగారం, బియ్యం ధర ధర ఎంత?
Happy Independence Day 2025: 1947లో మీరు ఒక రూపాయితో 1-2 కిలోల గోధుమ పిండి, అర్ధ కిలో వరకు దేశి నెయ్యి, కొర్రలు, ధాన్యాలు ఒక్క వారం వరకు కొనుగోలు చేసి స్టోర్ చేసుకోవచ్చు.
Happy Independence Day 2025: రైస్ గురించి మాట్లాడితే 1947లో ఒక కిలో బియ్యం ధర 12 పైసలు. గోధుమ పిండి కిలో 10 పైసలు, పప్పు 20 పైసలు. చక్కెర ధర కిలో 40 పైసలు. నెయ్యి ధర కిలో 75 పైసలు.
Happy Independence Day 2025: ఆధునిక కాలంలో 10 నుంచి 12 వేల రూపాయలకు లభించే సైకిల్ 1947లో 20 రూపాయలకే వచ్చేది. స్కూటర్, బైక్ లేదా కారు విషయానికి వస్తే, అవి కొంచెం ఖరీదైనవిగా ఉండేవి. ఆ సమయంలో రాజులు, మహారాజులు, పెద్ద పరిశ్రమల యజమానులు లేదా వ్యాపారులకు మాత్రమే వాటిని కొనుగోలు చేసే స్థోమత ఉండేది.
Happy Independence Day 2025: బంగారం విషయానికి వస్తే, 1947లో 10 గ్రాముల బంగారం ధర 88.62 రూపాయలు ఉండగా, నేడు లక్ష దాటింది. అదేవిధంగా పెట్రోల్ ధర 27 పైసలు ఉండగా, నేడు దాదాపు 100 రూపాయలకు చేరుకుంది.
Happy Independence Day 2025: స్వాతంత్య్రం వచ్చిన సమయంలో జనాభా 34 కోట్లకు దగ్గరగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 121 కోట్లు దాటింది. ఇప్పుడు 2022 నాటికి దేశ జనాభా 137.29 కోట్లకు మించి ఉంటుందని అంచనా.