Central Vista : తుది హంగులు అద్దుకుంటున్న నూతన పార్లమెంట్ భవనం
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. నూతన పార్లమెంట్ భవనానికి తుది హంగులు అద్దుతున్నారు.
నూతన పార్లమెంట్ వద్ద జాతీయ చిహ్నం
సెంట్రల్ విస్తాలో అరుదైన కళాకృతులు
నవంబర్ 2022 నాటికే నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. వివిధ కారణాలతో నిర్మాణం ఆలస్యమైంది.
జనవరి చివరి నాటికి సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు నిర్మాణ బాధ్యతలను తీసుకున్న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ పనులు వేగవంతం చేసింది.
నూతన పార్లమెంట్, పాత పార్లమెంట్
పార్లమెంట్ నూతన భవనానికి సంబంధించిన ఫొటోలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ అధికారిక వెబ్‌సైట్ లో ఉంచింది. ఈ నెలలో తీసిన ఫొటోలతోపాటు ప్రాజెక్టు ప్రారంభం నుంచి వివిధ దశల్లో తీసిన ఫొటోలను ఇందులో ఉంచింది.
తుది హంగులు అద్దుకుంటున్న నూతన పార్లమెంట్ భవనం