Interceptor Vehicle: స్పీడ్ లిమిట్ దాటే వాహనదారులకు చెక్ పెట్టే ఈ వెహికల్ ఏంటో తెలుసా?
Interceptor Vehicle: కొందరు వ్యక్తులు రోడ్లపై అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుంటారు. కొందరు అతి వేగంతో వాహనాలు డ్రైవ్ చేస్తుంటారు. జాతీయ రహదారులపై వేగ పరిమితి దాటే వారికి పోలీసులు చలాన్లు వేస్తుంటారు. మీ వాహనం ఎంత వేగంతో వెళ్లిందో ఫోటో చూపించి మరీ ఫైన్ వేస్తారు.
ఇంటర్‌సెప్టర్ అనే పోలీసు వెహికిల్ జాతీయ రహదారులపై ఉంటాయి. ఈ వాహనాన్ని దాటి ఓవర్ స్పీడ్ తో వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లతో సహా కనబడేలా ఇవి ఫోటో తీసి ఆ ప్రాంతంలో స్పీడ్ లిమిట్ ఎంత.. మీరెంత స్పీడ్ తో వెళ్తున్నారో చెబుతూ చలానా పంపిస్తారు.
ఈ ఇంటర్‌సెప్టర్ వాహనంలో రాడార్ ఆధారిత కెమెరా పరికరం ఉంటుంది. ఇది హైవేలపై విపరీతమైన వేగంతో వెళ్లే వాహనాలను కనిపెడుతుంది.
ఇంటర్ సెప్టర్ వాహనంలో ఉండే హెచ్ డీ కెమెరా, రాడార్ 200 - 700 మీటర్ల దూరంలోని ఇతర వాహనాల వేగాన్ని కచ్చితంగా అంచనా వేస్తుంది. నంబర్ ప్లేటుతో సహా ఫోటో తీస్తుంది.
రాడార్ నుండి వెలువడే రేడియో తరంగాలు వాహనానికి తగిలి తిరిగి వచ్చే సమయాన్ని బట్టి ఆ వాహనం ఎంత స్పీడ్ తో వెళ్తుందో కచ్చితంగా అంచనా వేసి మానిటర్ పై చూపిస్తుంది.
స్పీడ్ లిమిట్ దాటి వేగంగా వెళ్లే వాహనాలకు ఆన్ లైన్ సిస్టం ద్వారా చలానా విధిస్తారు.