Interesting Facts: చనిపోయిన తర్వాత కూడా మనిషి ఎలా బతుకుతాడు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?
ఈ టైటిల్ చూస్తే చనిపోయిన వ్యక్తి మళ్లీ ఎలా బతుకుతాడు అని మీకు కూడా అనిపిస్తుంది కదా? ఇలాంటి సంఘటనలను తరచుగా మతపరమైన నమ్మకాలతో ముడిపెడతారు. కానీ దీని వెనుక సైంటిఫిక్ రీజన్, సైన్స్ వాస్తవం చెబుతుంది.
మెడికల్ సైన్స్ ప్రకారం, ఇలాంటి పరిస్థితి అనుకోకుండా తలెత్తుతుంది. ఒక వ్యక్తి చనిపోయాడని సరిగ్గా నిర్ధారించనప్పుడు. అంటే, కేవలం గుండె కొట్టుకోవడం లేదా శ్వాస ఆగిపోవడం గమనించి డాక్టర్లు వ్యక్తి చనిపోయాడని నిర్ధారణ చేసినప్పుడు ఈ పరిస్థితి వస్తుంది.
శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యూజెస్ ప్రకారం ఎవరైనా వ్యక్తులు చనిపోయారనే ప్రక్రియను సరిగ్గా చేయకుండా వైద్యులు నిర్ధారించడం వల్ల ఇలా జరుగుతుంది. కొన్ని సందర్భాలలో శ్వాస తక్కువగా ఉన్నప్పుడు శ్వాస ఆగిపోయిందని చనిపోయినట్లు నిర్ధారిస్తారు. కానీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుంటే వ్యక్తుల్లో కదలిక రావడం, లేచి కూర్చున్న ఘటనలు అలాగే జరుగుతున్నాయి.
అలాంటి పరిస్థితిలో కొన్ని నిమిషాల తర్వాత, వ్యక్తి శరీరం మళ్ళీ కదలడం ప్రారంభిస్తుంది. గుండె కొట్టుకోవడం సాధారణ స్థితికి వస్తుంది. మెడికల్ సైన్స్ ప్రకారం ఇది సాధారణం, కాని మతపరమైన నమ్మకాలు దీనిని ప్రభావితం చేయకూడదు.
ధార్మిక, మత విశ్వాసాల ప్రకారం, ఏ వ్యక్తి మరణించే సమయం రాలేదో, అతడు తిరిగి బతుకుతాడు. కానీ ఇలాంటి మాటలను విజ్ఞానశాస్త్రం అంగీకరించదు. సైన్స్ ప్రకారం వ్యక్తి మరణాన్ని కొంతకాలం తాత్కాలికంగా నిలిపి వేయవచ్చు. కానీ దానిని పూర్తిగా రివర్స్ చేయలేము.
రజనీకాంత్ నటించిన శివాజీ సినిమాలో హీరో చనిపోయాడని డిసైడ్ చేస్తారు. కానీ ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం కదలిక లేని రజనీకాంత్ కు వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడంతో మళ్లీ బతుకుతాడు.