Women Always Feel Cold : మగవారి కంటే ఆడవారికే చలి ఎక్కువట.. అసలు రీజన్స్ ఇవే
శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేదా కదిలేటప్పుడు కండరాలు వేడిని ఉత్పత్తి చేస్తాయి. అయితే మహిళల్లో పురుషులతో పోలిస్తే కండర ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. దీనివల్ల మహిళల్లో వేడి తక్కువగా విడుదల అవుతుంది.
ప్రోజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లు రక్త ప్రసరణ, ఉష్ణోగ్రతను నియంత్రించడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. ప్రోజెస్టెరాన్ రక్త నాళాలను సంకోచింపజేస్తాయి. దీనివల్ల చేతులు, కాళ్ళలో రక్త ప్రవాహం తగ్గుతుంది. అందుకే చలిగా అనిపిస్తుంది.
మెటబాలిజం ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఈ ప్రక్రియలో వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. పురుషుల కంటే మహిళల్లో జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. దీనివల్ల తక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. దీనివల్ల కూడా తక్కువ వేడిని శరీరం ఉత్పత్తి చేస్తుంది.
పురుషులతో పోలిస్తే స్త్రీలలో కొవ్వు శాతం ఎక్కువ. ఈ ఫ్యాట్ ఇన్సులేటర్‌గా పనిచేసినా.. కండరాల మాదిరిగా వేడిని ఉత్పత్తి చేయదు. దానివల్ల చలి వస్తుంది.
మహిళల చుట్టూ ఉన్న పరిసరాలకు వేగంగా వేడిని కోల్పోతారట. దీనివల్ల వారి శరీరం ఉష్ణోగ్రతను నిర్వహించడం కష్టం అవుతుంది. చలి ఎక్కువ అవుతుంది.
శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు, జీవక్రియ వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. మహిళల్లో సెన్సిటివిటీ కొంచెం భిన్నంగా ఉండవచ్చు. దీనివల్ల శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ప్రభావితమవుతుంది. థైరాయిడ్ తక్కువగా పనిచేయడం లేదా జీవక్రియ నెమ్మదిగా ఉండటం వల్ల చలి సులభంగా అనిపించవచ్చు.