Jamuns Side Effects : నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

నేరేడు పండ్లు ఎవరు తినకూడదో తెలుసా?
నేరేడు పండ్లు సమ్మర్లో విరివిగా దొరుకుతాయి. ఆరోగ్యానికి మంచివని వీటిని ఎక్కువగా తింటారు. అయితే వీటిని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదట.
కడుపు సెన్సిటివ్గా ఉండే వారికి నేరేడు పండ్లు అంత మంచివి కాదు. ఎక్కువగా తింటే గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తింటే కొందరిలో అసిడిటీ లేదా వికారం కలగొచ్చు.
శస్త్రచికిత్స చేయించుకునే వారు లేదా ఇటీవల సర్జరీ చేసిన వారు నేరేడు పండ్లు పరిమితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి బ్లడ్ షుగర్‌పై ప్రభావం చూపొచ్చు.
షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండే వారు నేరేడు పండ్లు ఎక్కువగా తినకూడదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను మరింత తగ్గించే అవకాశం ఉంటుంది.
గర్భిణీలు ఎక్కువ మోతాదులో తినకూడదు. పరిమితంగా తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
నేరేడు పండ్లకు అలర్జీ ఉన్నవారిలో దురద, వాపు, చర్మ సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది.
ఏదైనా మందులు వాడుతున్నవారు ముఖ్యంగా డయాబెటిస్ మెడిసిన్స్ తీసుకునేవారు నేరేడు పండ్లు అధికంగా తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.