Head Bath Tips : తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. జుట్టు డ్యామేజ్ అవుతుంది

తలస్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
తరచుగా జుట్టు వాష్ చేయడం మంచిది కాదు. రోజూ లేదా అవసరానికి మించి తలస్నానం చేయడం వల్ల సహజ నూనెలు తొలగిపోతాయి. దీంతో జుట్టు పొడిబారడం, ఫ్రిజ్, విరిగిపోవడం వంటి సమస్యలు రావచ్చు.
మీ జుట్టు స్వభావానికి సరిపోని షాంపూను ఉపయోగిస్తే జుట్టు పొడిగా, రఫ్‌గా మారవచ్చు. డ్రై లేదా డ్యామేజ్డ్ హెయిర్‌కు తేమను అందించే షాంపూలను ఎంచుకోవడం మంచిది.
నూనె, చెమట, కాలుష్యం, హెయిర్ ప్రొడక్ట్స్ అవశేషాలు స్కాల్ప్‌పై పేరుకుపోవచ్చు. అవసరాన్ని బట్టి మైల్డ్ ప్రీ-వాష్ ట్రీట్‌మెంట్ లేదా స్కాల్ప్ క్లెన్సింగ్ ఉపయోగపడుతుంది.
జుట్టుపై షాంపూ లేదా కండీషనర్ అవశేషాలు మిగిలితే జుట్టు జిడ్డుగా, బరువుగా అనిపించవచ్చు. కాబట్టి నీటితో పూర్తిగా కడిగేయాలి.
తడిగా ఉన్న జుట్టును గట్టిగా దువ్వకండి. తడిగా ఉన్నప్పుడు జుట్టు మరింత బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో బలంగా దువ్వడం లేదా లాగడం వల్ల జుట్టు విరిగిపోయే అవకాశం పెరుగుతుంది.
స్ట్రెయిటెనర్లు, కర్లర్లు, బ్లో డ్రైయర్లను అధికంగా ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారి బలహీనంగా మారవచ్చు. వీటిని పరిమితంగా ఉపయోగించి, అవసరమైతే హీట్ ప్రొటెక్టెంట్ వాడటం మంచిది.