Taj Mahal in the Rain : వర్షం పడేప్పుడు తాజ్‌మహల్ వెళ్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీ సొంతం.. ఇలా ఫోటోలు కూడా దిగొచ్చు
తెల్లని పాలరాయిపై పడే వర్షపు బిందువుల మధ్య.. తాజ్ మహల్ ఎంత అందంగా ఉంటుందో తెలుసా? అందుకే వర్షాలు పడే సమయంలో దీనిని విజిట్ చేసేందుకు వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ పొందొచ్చట.
అందమైన తాజ్ మహల్ ముందు చేతులు చాచి.. రెట్టింపు ఆనందం పొందుతున్నట్లు ఫోటోలకు ఫోజులు ఇవ్వొచ్చు. అలాగే ఆ ఆనందాన్ని నిజంగా పొందవచ్చు. ఒకవైపు తాజ్ మహల్‌పై పడే వర్షం, మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం డెడ్లీ కాంబినేషన్ కదూ.
మీరు గ్యాంగ్‌గా వెళ్తే.. తాజ్ మహల్ ప్రాంగణంలో నడుస్తూ.. వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఇలాంటి ఫోటోలు ట్రై చేయవచ్చు.
గొడుగులు పట్టుకుని వర్షంలోనూ ఫోటోలు తీసుకోవచ్చు. కలర్‌ఫుల్ గొడుగులు పట్టుకుని.. వివిధ ఫోజులిస్తూ.. తాజ్‌మహాల్ ముందు దిగొచ్చు.
అందుకే వర్షాకాలంలో తాజ్‌మహల్‌ను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. తేలికపాటి చినుకుల పడేప్పుడు వెళ్తే చూసేందుకు చక్కగా ఉంటుంది.
వర్షం తరువాత తాజ్‌మహల్ వెనుక పచ్చని తోటలు మరింత తాజాగా, ఫ్రెష్‌గా కనిపిస్తాయి. మేఘాల మధ్య నల్లటి మబ్బులతో కప్పబడిన తాజ్‌మహల్ చాలా అందంగా కనిపిస్తోంది.