UPI Payments New Rules : UPI రూల్స్ మార్చేశారుగా.. ఆ నియమాలు ఫాలో అవ్వకపోతే డబ్బులు కట్ అయిపోతాయ్
కాలక్రమేణా UPI వినియోగంలో చాలా మార్పులు వచ్చాయి. దానిలో భాగంగా కొత్త నిబంధనలు తెరపైకి తీసుకొచ్చారు . దేశవ్యాప్తంగా ఆగస్టు 1, 2025 నుంచి UPI న్యూ రూల్స్ చేశారు. బ్యాలెన్స్ చెక్ చేయడం నుంచి ఎన్నో నిబంధనలు మార్చారు.
పదే పదే బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు ఉంటే.. ఆ అలవాటును మార్చుకోవాలి. కొత్త నిబంధనల ప్రకారం.. మీరు ఒక రోజులో 50 సార్లు మాత్రమే మీ బ్యాలెన్స్ను చెక్ చేసుకోగలుగుతారు. ఇంతకు ముందు ఎటువంటి పరిమితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు పదే పదే బ్యాలెన్స్ చూడటం వల్ల సర్వర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. దానిని తగ్గించడానికి ఈ పరిమితిని నిర్ణయించారు.
ఆటో చెల్లింపులకు సంబంధించి కూడా సమయ వ్యవధిని కూడా నిర్ణయించారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ లేదా ఏదైనా ఆటో డెబిట్ సెట్టింగ్ ఉన్న చెల్లింపులు ఉదయం 10 గంటలలోపు లేదా మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రమే జరుగుతాయి. మిగిలిన సమయంలో కాకుండా ఆటో డెబిట్స్ జరగవు.
UPI యాప్‌లలో హిస్టరీని పదే చూడకూడదని పరిమితి విధించారు. ఇకపై మీరు ఏ యాప్ నుంచైనా రోజుకు 25 సార్లు మాత్రమే లావాదేవీలు చెక్ చేసుకోవాలి.
లావాదేవీ తర్వాత చెల్లింపు తర్వాత.. దాని డిటైల్స్ చెక్ చేయడానికి కూడా నిబంధనలు విధించారు. ఇప్పుడు మీరు ఒక రోజులో మూడుసార్లు మాత్రమే పేమెంట్ డిటైల్స్ చెక్ చేయవచ్చు. రెండు సార్లు మధ్య కనీసం 90 సెకన్ల వ్యవధి ఉండాలి. పదేపదే రిఫ్రెష్ చేయడం వల్ల సిస్టమ్‌పై లోడ్ పడుతుంది.
వాపస్ చేయడం లేదా ఛార్జ్‌బ్యాక్‌కు సంబంధించి కూడా పరిమితి విధించారు. ఇప్పుడు నెలకు 10 సార్లు మాత్రమే రివర్సల్ కోసం అభ్యర్థించవచ్చు. ఏదైనా ఒక వ్యాపారి లేదా వ్యక్తి నుంచి డబ్బు తిరిగి పొందడానికి పరిమితిని 5 సార్లు పరిమితం చేశారు. నకిలీ అభ్యర్థనలు, దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని లక్ష్యం. అందుకే UPIని ఉపయోగిస్తున్నప్పుడు ఇప్పుడు నియమాలను గుర్తుంచుకోవడం ముఖ్యం.