Superfoods for Skin Glow : చలికాలంలో తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే.. చర్మానికి చాలా మంచివి
క్యారెట్ ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల చర్మానికి లోపలి నుంచి పోషణ అందుతుంది. ముఖానికి మెరుపు చాలా కాలం పాటు ఉంటుంది. సలాడ్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉసిరి విటమిన్ సికి నిలయం. శీతాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది. ఉసిరి తినడం వల్ల చర్మం మెరుస్తుంది. మచ్చలు తగ్గుతాయి. దీనిని ఊరగాయ, చట్నీ లేదా సాధారణ రూపంలో కూడా తినవచ్చు. ఖాళీ కడుపుతో ఉసిరి తినడం వల్ల దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఇది చర్మానికి మాత్రమే కాదు.. జుట్టుకు కూడా మేలు చేస్తుంది.
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి లోపలి నుంచి పోషణనివ్వడంతో పాటు తేమను నిలుపుకోవడానికి సహాయపడతాయి. రోజూ వాల్‌నట్స్ తినడం వల్ల చర్మానికి లోతైన తేమ అందుతుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది. మీరు వీటిని స్నాక్స్‌గా, స్మూతీలలో లేదా సలాడ్‌లలో వేసుకుని తినవచ్చు.
పాలకూర చలికాలంలో తింటే మంచిది. ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, సి, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా యవ్వనంగా ఉంచుతాయి. పాలకూరను సూప్, పరాటా లేదా కూరగాయల రూపంలో డైట్లో చేర్చుకోవచ్చు.
అవోకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచుతుంది. ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. స్మూతీలు, సలాడ్లు లేదా బ్రెడ్ స్ప్రెడ్ రూపంలో తినవచ్చు. మీరు దీన్ని మెత్తగా చేసి ఫేస్ మాస్క్గా కూడా ఉపయోగించవచ్చు.
చలికాలంలో బాదం, జీడిపప్పు, పొద్దుతిరుగుడు గింజలు, చియా సీడ్స్, నట్స్ చర్మానికి చాలా మంచివి. వీటిలో విటమిన్ ఇ, ఒమేగా-3 వంటి అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మానికి లోపలి నుంచి పోషణ, తేమను అందిస్తాయి. వీటిని మీరు స్నాక్స్ రూపంలో లేదా పెరుగు, సలాడ్తో తీసుకోవచ్చు.