Tips to Reduce Acidity : ఎసిడిటీని తగ్గించే 6 టిప్స్.. ఉదయాన్నే, డిన్నర్ సమయంలో ఇవి ఫాలో అవ్వాలట
ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభిస్తే అది కడుపును శుభ్రపరుస్తుంది. అలాగే ఎసిడిటీని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
తిన్న వెంటనే పడుకోవడం వల్ల కూడా శరీరంలో ఎసిడిటీ పెరుగుతుంది. దీనివల్ల మంట, వాంతు అయ్యే ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత కాసేపు నడిచి.. ఆ తర్వాత పడుకుంటే బెస్ట్.
మజ్జిగ లేదా పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపులోని వేడిని తగ్గిస్తాయి. అలాగే ఎసిడిటీని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి. ఇవి ఎసిడిటీని కంట్రోల్ చేస్తాయి. దీనిని టీ రూపంలో లేదా వంటల్లో కలిపి తీసుకోవచ్చు.
అవసరానికి మించి తింటే కడుపుపై ఒత్తిడి పెరుగుతుంది. ఆమ్లతను పెంచుతుంది. కాబట్టి తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. బాగా నమిలి తినాలి.
ఎక్కువ వేయించిన లేదా మసాలా ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు. ఇది కడుపులో ఎసిడిటీని పెంచుతుంది. కాబట్టి రాత్రి భోజనం తేలికగా ఉండేలా, త్వరగా తినేలా ప్లాన్ చేసుకోండి.