Right Way to Boiling Eggs : గుడ్లు పగలకుండా ఉడికించే సరైన పద్ధతి ఇదే.. పర్ఫెక్ట్‌గా బాయిల్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

గుడ్లు ఇలా ఉడికిస్తేనే టేస్ట్, టెక్స్చర్ పర్ఫెక్ట్
చాలామంది గుడ్లు ఫ్రిడ్జ్‌లో పెడతారు. ఇలా ఫ్రిడ్జ్ నుంచి తీసిన గుడ్లను వెంటనే మరిగించే నీటిలో వేయకండి. కొద్దిసేపు బయట పెడితే పగిలే అవకాశం తగ్గుతుంది.
గుడ్లను ముందుగా పాత్రలో పెట్టి వాటి మీద నీళ్లు పోసి తర్వాత స్టవ్ ఆన్ చేయండి. అప్పుడే ఎగ్స్ సమానంగా ఉడుకుతాయి.
నీటిలో చిటికెడు ఉప్పు లేదా కొద్దిగా వెనిగర్ వేస్తే గుడ్లు పగిలినా బయటకు రాకుండా ఉంటాయి.
ఎక్కువ మంటపై ఉడికిస్తే గుడ్లు క్రాక్ అవుతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవడం మంచిది.
సాఫ్ట్ బాయిల్డ్ చేయాలంటే 6 నుంచి7 నిమిషాలు, హార్డ్ బాయిల్డ్ చేయాలంటే 9 నుంచి 12 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది.
ఉడికిన వెంటనే చల్లని నీటిలో లేదా ఐస్ వాటర్‌లో వేస్తే పెంకు ఈజీగా తొలగుతుంది.
గుడ్డు షెల్‌ను సాఫ్ట్‌గా ట్యాప్ చేసి తీయండి. నీటిలో తీయడం వల్ల ఇంకా సులభంగా వస్తుంది.