Kidney Health : కిడ్నీని ఆరోగ్యంగా ఉంచే అలవాట్లు ఇవే.. మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా ఇవి హెల్ప్ చేస్తాయట
రక్తాన్ని ఫిల్టర్ చేసి టాక్సిన్లను బయటకు పంపించడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే కిడ్నీళ్లో రాళ్లు ఏర్పడకుండా.. ఇతర సమస్యలు రాకుండా ఉండేందుకు లైఫ్స్టైల్లో కొన్ని అలవాట్లు నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..
రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలి. నీరు కిడ్నీల్లోని టాక్సిన్లను బయటకి పంపడంలో హెల్ప్ చేస్తుంది. ఇవి కిడ్నీల్లో రాళ్లను కూడా బయటకు పంపుతుంది. కాబట్టి హైడ్రేటెడ్‌గా ఉండేందుకు నీటిని తీసుకోండి.
బ్యాలెన్స్డ్ డైట్ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి పండ్లు, కూరగాయలు, మల్టీగ్రెయిన్స్, సోడియం తక్కువగా ఉండే పుడ్స్ రోజూ తీసుకోవాలి. సాల్ట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోకూడదు. ఇవి కిడ్నీలపై ఎక్కువ భారం వేస్తాయి.
రోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఇది బీపిని అదుపులో ఉంచుతుంది. దీనివల్ల బరువు పెరగకుండా ఉంటారు. దీనివల్ల కిడ్నీలపై భారం తగ్గుతుంది.
బ్లడ్ షుగర్, బీపీ కిడ్నీలను ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి రెగ్యులర్‌గా చెకప్స్ చేయింటుకోవాలి. వైద్యులు సూచించిన మెడిసన్స్ తీసుకోవాలి.
పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వేసుకోకూడదు. ఇవి కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి. నరాలపై నెగిటివ్‌గా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వైద్యులు సూచనలతో వాటిని తీసుకుంటే మంచిది.
సిగరెట్, మందు కూడా కిడ్నీలపై నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి కాబట్టి.. వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.