Symptoms of Liver Damage : కాలేయం దెబ్బతింటే రాత్రుళ్లు ఈ లక్షణాలు కనిపిస్తాయట.. జాగ్రత్త, విస్మరించకండి
జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఇది డ్యామేజ్ అయితే పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.
కాలేయ సమస్యలు చాలా ఆలస్యంగా బయటపడతాయి. కానీ కొన్ని సందర్భాల్లో లివర్ డ్యామేజ్ లక్షణాలు రాత్రుళ్లు కనిపిస్తాయట. పలు అధ్యయనాలు కూడా ఇది నిజమని తేల్చాయి.
కాలేయ సమస్యలు ఉంటే రాత్రుళ్లు కొన్నిమార్పులు చోటు చేసుకుంటాయని వాటిని విస్మరించవద్దని సూచిస్తున్నారు. అలాంటి వాటిలో అధిక చెమట ఒకటి. లివర్ డ్యామేజ్ అయితే రాత్రుళ్లు ఎక్కువగా చెమట వస్తుందట.
కాలేయం దెబ్బతిన్నప్పుడు శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ కారణంగా.. శరీరం వేడిని కంట్రోల్ చేసే సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుంది.
రాత్రుళ్లు మూత్ర విసర్జన చేయడానికి ఎక్కువగా లేవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని నోక్టురియా అంటారు. ఇది కూడా కాలేయ సమస్యని సూచిస్తుంది.
కాలేయం దెబ్బతిన్నప్పుడు శరీరంలో పిత్త లవణాలు పేరుకుపోతాయి. దీనివల్ల చేతులు, కాళ్లతో పాటు మొత్తం శరీరం దురద వస్తుంది.
శరీరంలో టాక్సిన్లు పేరుకుపోవడం వల్ల అలసట, కాళ్లు లాగడం వంటివి జరుగుతాయి. దీనివల్ల నిద్ర సరిగ్గా రాదట. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.