Diabetes Symptoms : మధుమేహానికి ప్రారంభ సంకేతాలు ఇవే.. ఉదయాన్నే ఇలా ఉంటే విస్మరించకండి
మీరు ప్రతి ఉదయం లేవగానే పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లవలసి వస్తే.. ఇది అధిక బ్లడ్ షుగర్‌కి సంకేతం కావచ్చు. శరీరం మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్ స్థాయిని తొలగించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి దీనిని సాధారణమైన సమస్యగా భావించవద్దు.
ఉదయం లేవగానే పదేపదే నీరు తాగాలనిపించడం.. నోరు పొడిగా అనిపిస్తుంటే తేలికగా తీసుకోకండి. రాత్రి నిద్ర తర్వాత దాహం వేయడం కామన్ కానీ.. నోరు పొడిగా మారిపోవడం వంటి లక్షణాలు మధుమేహానికి సంకేతాలు కావొచ్చు. మూత్రం ద్వారా కూడా నీరు వెళ్లిపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.
సరిగ్గా నిద్రపోయినప్పటికీ.. ఉదయం లేవగానే శరీరం బరువుగా అనిపించినా, అలసట అనిపించినా లేదా రోజు ప్రారంభం బలహీనంగా అనిపించినా.. ఇది మధుమేహంలో దాగి ఉన్న లక్షణం కావచ్చు.
ఉదయం సమయంలో కళ్ల ముందు అస్పష్టంగా లేదా స్పష్టంగా కనిపించకపోవడం వంటి లక్షణాలు మధుమేహానికి ప్రారంభ సంకేతాలు కావచ్చు. రక్తంలో చక్కెర అసమతుల్యత కంటి నరాలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల దృష్టి ప్రభావితమవుతుంది.
ఉదయం నిద్రలేవగానే తల భారంగా లేదా నొప్పిగా అనిపిస్తే.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గుల ప్రభావం కావచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో రక్తంలో చక్కెర తగ్గడం, ఉదయం వేగంగా పెరగడం వల్ల ఇది జరగవచ్చు.
ఉదయం వేళల్లో కాళ్లలో తిమ్మిరి లేదా స్పర్శ లేనట్లు అనిపించడం నరాలపై ప్రభావం చూపుతున్నట్లుగా ఉండవచ్చు. ఇది డయాబెటిక్ న్యూరోపతి ప్రారంభానికి సంకేతం. దీనిని నిర్లక్ష్యం చేయడం హానికరం కావచ్చు.