Pregnancy Complications : ప్రెగ్నెన్సీ సమయంలో ఏ వ్యాధులు అత్యంత ప్రమాదకరమో తెలుసా?
గర్భం దాల్చినప్పుడు కొన్ని పరిస్థుతుల్లో మహిళలు కొన్ని వ్యాధుల బారిన పడతారు. ఆ ప్రమాదం పెరిగితే ఆ వ్యాధి తల్లితో పాటు పిల్లలను ఎఫెక్ట్ చేస్తుంది.
అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తారు. అసలు ఏ వ్యాధి గర్భిణీలకు వస్తే అది అత్యేంత ప్రమాదకరంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భధారణ సమయంలో మహిళలకు హెపటైటిస్ సి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ప్రమాదకరం.
ఈ సమస్య వచ్చిన వారికి శరీరంపై చిన్న చిన్న దద్దుర్లు వస్తాయి. క్రమంగా కాలేయంపై ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా చాలా ప్రమాదకరంగా చెప్తారు.
థైరాయిడ్ సమస్యలు కూడా ప్రెగ్నెన్సీ సమయంలో ప్రమాదకరంగా మారుతాయి. కొన్ని సందర్భాల్లో గర్భస్రావానికి థైరాయిడ్ కారణం అవుతుంది.
ఈ వ్యాధులను నివారించడానికి తరచుగా చేతులు శానిటైజర్ ఉపయోగించాలి. అంతేకాకుండా హెల్తీ డైట్ తీసుకోవాలి. హైడ్రేషన్ చాలా ముఖ్యమని గుర్తించుకోవాలి. తగినంత నిద్ర కూడా ఈ సమస్యలను దూరం చేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.