Tequila Shots : టకీలా షాట్ తాగేప్పుడు ఆ తప్పులు అస్సలు చేయకూడదట.. సరైన పద్ధతి ఇదే
టకీలా షాట్ తీసుకునే ముందు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఖాళీ కడుపుతో అస్సలు తాగకూడదు. ఖాళీ కడుపుతో మద్యం శరీరంలో చాలా త్వరగా ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల త్వరగా మత్తులోకి వెళ్లిపోతారు. ఒక చిన్న స్నాక్ కూడా మీ శరీరంలో పెద్ద తేడాను ఇస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరెండవ తప్పు నీరు తీసుకోకపోవడం. టకీలా వేగంగా ప్రభావం చూపిస్తుంది. శరీరాన్ని వెంటనే డీహైడ్రేట్ చేస్తుంది. అందువల్ల షాట్ తీసుకునే ముందు, తరువాత కొన్ని సిప్స్ నీరు తాగాలి. ఇది మైకం, తలనొప్పిని బాగా తగ్గిస్తుంది.
మూడవది టకీలాను ఎల్లప్పుడూ నెమ్మదిగా తీసుకోవాలి. చాలా మంది ఒక్కొక్కటిగా ఒకేసారి తీసుకుంటారు. ఇది గుండె వేగాన్ని పెంచుతుంది. శరీరం అసౌకర్యంగా ఉంటుంది. శరీరం దానిని సరిగ్గా బ్యాలెన్స్ చేయడానికి 5 నుంచి 10 నిమిషాల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
ఉప్పు, నిమ్మకాయలను సరిగ్గా ఉపయోగించడం కూడా ముఖ్యం. చాలా మంది దీన్ని కేవలం ప్రదర్శన కోసం మాత్రమే చేస్తారు. కానీ ఈ రెండూ పానీయాన్ని మృదువుగా చేస్తాయి. తీవ్రమైన మంటను తగ్గిస్తాయి. కొద్దిగా ఉప్పు, షాట్, ఆపై నిమ్మకాయ తీసుకుంటే ఇదే క్లాసిక్ మార్గం.
టకీలా షాట్ తాగేప్పుడు బ్రీత్ బిగబట్టి తాగకూడదు. అలా చేయడం వల్ల మంట ఎక్కువ అనిపిస్తుంది. కొన్నిసార్లు దగ్గు కూడా వస్తుంది. శ్వాసను సాధారణంగా ఉంచుకోండి. పూర్తిగా రిలాక్స్ అవుతూ షాట్ తీసుకోండి.
షాట్ తీసుకున్న వెంటనే ఆహారం లేదా స్వీట్ తినడం కూడా తప్పే. ఇది మద్యం ప్రభావాన్ని మరింత వేగంగా శరీరంలోకి వ్యాపింపజేస్తుంది. కనీసం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిని ఉంచండి. తద్వారా శరీరం సమతుల్యతను కాపాడుకుంటుంది.