Summer Hair Loss : వేసవిలో జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? ఇవే ప్రధాన కారణాలు

వేసవిలో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఇవే
ఎండలో ఎక్కువసేపు తిరిగితే తల చర్మం డ్రై అయి, హెయిర్ రూట్స్ బలహీనపడతాయి. అధిక వేడి జుట్టును డ్యామేజ్ చేస్తుంది.
సమ్మర్‌లో ఎక్కువగా చెమట పడటం వల్ల స్కాల్ప్‌లో డర్ట్, ఆయిల్ పేరుకుని హెయిర్ ఫాల్ పెరుగుతుంది.
నీళ్లు తక్కువగా తాగితే శరీరం డీహైడ్రేషన్‌కి గురై.. జుట్టుకు తగిన తేమ అందదు. దీంతో జుట్టు డ్రై అయి రాలిపోతుంది.
సూర్యుడి UV రేస్ హెయిర్ ప్రోటీన్‌ను దెబ్బతీసి జుట్టు పలుచగా, బలహీనంగా మారుస్తాయి.
చెమట, ధూళి పేరుకుని స్కాల్ప్ బ్లాక్ అవుతుంది. ఇది హెయిర్ ఫాల్‌కు కారణం. జుట్టు సమస్యలు పెంచుతుంది.
సమ్మర్లో చాలామంది స్విమ్మింగ్ చేస్తారు. అయితే స్విమ్మింగ్ పూల్స్‌లో ఉన్న క్లోరిన్ జుట్టును డ్రై చేసి రూట్స్‌ను దెబ్బతీస్తుంది.
తక్కువగా తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల హెయిర్‌కు అవసరమైన న్యూట్రియెంట్స్ తగ్గిపోతాయి.
సమ్మర్‌లో జుట్టు రాలిపోకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగడం, తేలికపాటి పోషకాహారం తీసుకోవడం, తల చర్మం శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.