✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి

Geddam Vijaya Madhuri   |  26 Oct 2026 11:42 AM (IST)
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి

తక్కువ సమయంలో పని పూర్తి చేయాలంటే ఈ టిప్స్ ఇవే

1

మీరు వర్క్ ఫినిష్ చేయడానికి ఎక్కువ సమయం పడుతోందా? మొబైల్ నోటిఫికేషన్లు, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలు మీ ఏకాగ్రతపై ప్రభావం చూపించవచ్చు. అలాంటి సమయంలో కొన్ని చిట్కాలు ఫాలో అయితే.. పనిపై దృష్టి పెట్టే సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

Continues below advertisement
2

రోజు ప్రారంభంలో చేయాల్సిన పనులను ఒక జాబితాగా రాసుకోండి. వాటిలో ముఖ్యమైన పనులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఏ పని ముందుగా చేయాలో స్పష్టత వస్తుంది. ఒకేసారి అన్ని పనుల గురించి ఆలోచించే ఒత్తిడి కూడా తగ్గుతుంది.

Continues below advertisement
3

పని చేస్తున్నప్పుడు వచ్చే మెసేజ్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఏకాగ్రతను దెబ్బతీయవచ్చు. అవసరం లేని నోటిఫికేషన్లను ఆఫ్ చేసి, మొబైల్‌ను కొంచెం దూరంగా పెట్టండి. మెసేజ్‌లు చూసేందుకు ప్రత్యేక సమయం కేటాయిస్తే పనిపై ఎక్కువసేపు దృష్టి పెట్టగలుగుతారు.

4

ఒకే సమయంలో అనేక పనులు చేయడానికి ప్రయత్నిస్తే పదేపదే డైవర్ట్ అవుతారు. దీంతో పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అందుకే ఒక పనిని ఎంచుకుని దానిని పూర్తి చేసిన తర్వాత మరో పనిని ప్రారంభించండి. ముఖ్యంగా రాయడం, లెక్కలు చేయడం వంటి ఎక్కువ ఏకాగ్రత అవసరమైన పనులకు ఇది హెల్ప్ అవుతుంది.

5

ఎక్కువసేపు విరామం లేకుండా పనిచేస్తే అలసట పెరిగి దృష్టి తగ్గవచ్చు. అందుకే మీ పనికి అనుగుణంగా గంటకోసారి చిన్న విరామం తీసుకోండి. ఆ సమయంలో కాసేపు నడవడం, నీళ్లు తాగడం లేదా కళ్లకు విశ్రాంతి ఇవ్వడం మంచిది.

6

నిద్ర సరిగా లేకపోతే మరుసటి రోజు అలసట, మతిమరుపు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఎదురవవచ్చు. కాబట్టి రాత్రి నిద్ర కనీసం 7 నుంచి 9 గంటలు ఉండేలా చేసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్రకు ముందు మొబైల్ వినియోగాన్ని తగ్గించడం ఉపయోగపడతాయి.

7

సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, రోజంతా తగినంత నీరు తాగడం శరీరం, మెదడు సాధారణ పనితీరుకు అవసరం. అల్పాహారాన్ని పూర్తిగా మానేయకుండా పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు వంటి పోషకాహార పదార్థాలను ఆహారంలో చేర్చుకోండి. భోజనం మానేయడం లేదా నీళ్లు తక్కువగా తాగడం వల్ల కొందరిలో అలసట, తలనొప్పి రావచ్చు.

8

రోజూ కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకోండి. ఇది ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మనసును పనిపై నిలిపేందుకు సహాయపడవచ్చు. పని మధ్యలో ఆందోళనగా అనిపించినప్పుడు డీప్ బ్రీతింగ్ తీసుకోవడం మంచిది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.