✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Oil Pulling : ఆయిల్ పుల్లింగ్ చేయాల్సిన విధానం ఇదే.. ఇలా చేస్తేనే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం

Geddam Vijaya Madhuri   |  14 May 2026 12:26 PM (IST)
Oil Pulling : ఆయిల్ పుల్లింగ్ చేయాల్సిన విధానం ఇదే.. ఇలా చేస్తేనే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం

ఆయిల్ పుల్లింగ్ ఎలా చేస్తే మంచిదో తెలుసా?

1

ఆయిల్ పుల్లింగ్‌ను ఉదయం నిద్రలేచిన వెంటనే, ఏదైనా తినే ముందు చేయడం ఉత్తమం. ఈ సమయంలో నోటిలో రాత్రంతా పేరుకుపోయిన బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో చేయడం వల్ల నోటి పరిశుభ్రత మెరుగుపడటమే కాకుండా మంచి ఫ్రెష్‌నెస్ కూడా వస్తుంది.

2

కొబ్బరి నూనె, నువ్వుల నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి నేచురల్ ఆయిల్స్‌ను ఉపయోగించవచ్చు. వీటిలో ముఖ్యంగా కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. ఎప్పుడూ శుభ్రమైన, నాణ్యమైన నూనెనే ఉపయోగించడం మంచిది.

3

మొదటిసారి చేస్తున్నవారు ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకోవచ్చు. ఎక్కువ నూనె తీసుకుంటే నోటిలో ఉంచుకోవడం అసౌకర్యంగా అనిపించవచ్చు. చిన్న పరిమాణంతో ప్రారంభించి అలవాటు అయిన తర్వాత అవసరమైతే పెంచుకోవచ్చు.

4

నూనెను నోటిలో గార్గిల్ చేసినట్లు బలంగా కాకుండా, మెల్లగా పళ్ల మధ్య తిప్పాలి. ఇలా చేయడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా, మలినాలు నూనెలో కలుస్తాయి. అయితే నూనెను మింగకూడదు. ఎక్కువసేపు చేయలేకపోతే 5 నిమిషాల నుంచి మొదలుపెట్టి క్రమంగా టైమ్ పెంచుకోవచ్చు.

5

ఆయిల్ పుల్లింగ్ పూర్తయ్యాక నూనెను సింక్‌లో ఉమ్మేయడం మంచిది కాదు. ముఖ్యంగా కొబ్బరి నూనె చల్లబడిన తర్వాత గట్టిపడి పైపులు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే టిష్యూ లేదా చెత్త బుట్టలో వేయడం మంచిది.

6

నూనె ఉమ్మేసిన తర్వాత గోరువెచ్చని నీటితో నోరు బాగా కడుక్కోవాలి. తర్వాత సాధారణంగా బ్రష్ చేసుకుంటే మరింత పరిశుభ్రత ఉంటుంది. ఇలా చేయడం వల్ల నోటిలో ఆయిల్ ఫీలింగ్ కూడా తగ్గిపోతుంది.

7

ఒక్కరోజు లేదా రెండు రోజులు చేస్తే పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు. ప్రతిరోజూ రెగ్యులర్‌గా చేయడం వల్ల నోటి ఆరోగ్యం, దుర్వాసన తగ్గడం, చిగుళ్ల ఆరోగ్యం వంటి ప్రయోజనాలు క్రమంగా కనిపిస్తాయి. అయితే ఏదైనా అలర్జీ లేదా అసౌకర్యం ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Oil Pulling : ఆయిల్ పుల్లింగ్ చేయాల్సిన విధానం ఇదే.. ఇలా చేస్తేనే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.