Using Mobile at Night : నిద్రపోయే ముందు ఫోన్ ఎక్కువగా చూస్తే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు.. పిల్లలైనా, పెద్దలైనా
మొబైల్, లాప్టాప్ స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కాంతి మెలాటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల నిద్ర పట్టకపోవడం లేదా పదేపదే నిద్రలో లేవడం జరుగుతుంది.
రాత్రిపూట చీకటిలో స్క్రీన్ చూడటం వల్ల కళ్లు త్వరగా అలసిపోతాయి. పొడిబారిపోతాయి. మంట, కళ్లు అస్పష్టంగా కనిపించడం జరుగుతాయి. ఎక్కువకాలం ఇదే అలవాటు అయితే కంటి చూపును బలహీనపడుతుంది.
సోషల్ మీడియా లేదా ఓవర్ థింకింగ్ కంటెంట్‌ను రాత్రి సమయంలో చూడటం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది. దీనివల్ల నిద్ర పట్టదు. ఇది చికాకు లేదా డిప్రెషన్ పెంచుతుంది.
చీకటిలో స్క్రీన్ చూపడం వల్ల కళ్లపై, మెదడుపై ఒత్తిడిని కలుగుతుంది. దీనివల్ల మైగ్రేన్, తలనొప్పి వస్తుంది.
రాత్రిపూట స్క్రీన్ చూడటం వల్ల ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఏర్పడుతుంది. ఇది నిద్రలేమికి దారి తీస్తుంది. ఇది జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.
నిద్రకు భంగం కలగడం వల్ల శరీరంలోని సహజమైన హార్మోన్లపై ప్రభావం పడుతుంది. ఇది మహిళల్లో నెలసరి సమస్యలను పెంచుతుంది. పురుషుల్లో లైంగిక రుగ్మతలకు కారణమయ్యేది.