Headache Warning Signs : తలనొప్పితో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటోన్న నిపుణులు

తలనొప్పితో పాటు ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త
హఠాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా తీవ్రమైన తలనొప్పి వస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
చూపు మసకబారడం లేదా డబుల్ విజన్ కూడా ఈ లక్షణాల్లో ఒకటి. తలనొప్పితో పాటు చూపులో మార్పులు, వస్తువులు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త అవసరమని చెప్తున్నారు నిపుణులు.
మాటలు సరిగా రాకపోవడం, అయోమయం, ఆలోచనా సామర్థ్యం తగ్గడం వంటి లక్షణాలు తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు.
చేతులు, కాళ్లు లేదా ముఖం ఒకవైపు మొద్దుబారడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
తలనొప్పితో పాటు అధిక జ్వరం, మెడ గట్టిపడటం వంటి లక్షణాలు ఇన్‌ఫెక్షన్‌కు సంకేతంగా ఉండవచ్చు. దానిని నిర్లక్ష్యం చేయకూడదు.
తలనొప్పితో పాటు కారణం లేకుండా పదేపదే వాంతులు వస్తే అది మెదడుకు సంబంధించిన సమస్యను సూచించే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు.
ఏదైనా ప్రమాదం లేదా దెబ్బ తగిలిన తర్వాత తలనొప్పి తీవ్రంగా ఉండటం, నిద్రమత్తు లేదా తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.