Rashmika Mandanna Fitness : రష్మికా మందన్నా ఫిట్నెస్ సీక్రెట్స్.. బిజీ షెడ్యూల్లో కూడా ఎలా ఫిట్‌గా ఉంటుందంటే
రష్మికా వర్కవుట్ రొటీన్ ఏదో ఒక వ్యాయామానికి పరిమితం కాదు. ఆమె ఫిట్‌నెస్‌లో విభిన్నమైనవి ప్రయత్నిస్తుంది. వారానికి నాలుగు రోజులు ఆమె వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంది. కొన్నిసార్లు కిక్ బాక్సింగ్, డాన్స్, మరికొన్నిసార్లు స్విమ్మింగ్, స్పిన్నింగ్ లేదా యోగా చేస్తుంది. కార్డియో కోసం ఆమె బ్రిస్క్ వాకింగ్ చేస్తుంది. అయితే స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌లో ల్యాండ్ మైన్ డెడ్ లిఫ్ట్, పుష్-అప్స్, చిన్-అప్స్, స్నాచ్ వంటి మల్టీ-జాయింట్ మూమెంట్స్ చేస్తుంది.
రష్మిక.. ఫిట్నెస్ పట్ల ప్రేమ ఉండాలని లేకపోతే ఎక్కువ కాలం అది చేయమలేమని చెప్తుంది. అందుకే బోర్ కొట్టకుండా వ్యాయామాల జాబితాను మారుస్తూ ఉంటానని తెలిపింది. దీనివల్ల విసుగు అనేది ఉండదట. కొన్నిసార్లు యోగాతో శరీరాన్ని స్ట్రెచ్ చేస్తుంది. మరికొన్నిసార్లు కిక్ బాక్సింగ్‌తో చెమటలు పట్టిస్తుంది.
రష్మికా కేవలం వ్యాయామం చేయటం ద్వారా ఫిట్నెస్ సాధించలేమంటోంది. దానితో పాటు సరైన ఆహారం, తగినంత నీరు తీసుకోవడం కూడా అవసరమని చెప్తుంది. రోజును ఒక పెద్ద గ్లాసు నీటితో ప్రారంభిస్తుందట. కొన్నిసార్లు జీవక్రియను వేగవంతం చేయడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకుంటుందట. ఆమె ఎక్కువగా శాఖాహారం, గుడ్లు తీసుకుంటుందట. టమోటాలు, క్యాప్సికమ్, దోసకాయ, బంగాళాదుంప వంటి వాటికి దూరంగా ఉంటుందట.
మధ్యాహ్న భోజనంలో ఆమె తేలికైన, పోషకమైన ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతుందట. సౌత్ ఇండియన్ ఫుడ్ ఇష్టమని.. కానీ అన్నం తక్కువగా తీసుకుంటుందట. రాత్రి భోజనం లైట్‌గా తీసుకుంటుదట. లేదంటే సూప్ లేదా పండ్లు తీసుకుంటుందట. చిరుతిండి తినాలనిపిస్తే.. జంక్ ఫుడ్‌కు బదులుగా స్వీట్ పొటాటో, డ్రై ఫ్రూట్స్ లేదా సీడ్స్ తింటుంది.
రష్మిక ఎక్కువసేపు షూటింగ్ చేసినప్పుడు ఎనర్జీ కోసం చాలా నీరు తాగుతుంది. రోజంతా 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగుతుంది. ఎల్లప్పుడూ తనతో వాటర్ బాటిల్ ఉంచుకుంటుంది. తగినంత నీరు తాగకపోతే చర్మం మాత్రమే కాదు కండరాలు కూడా అలసిపోతాయని ఆమె చెబుతుంది. షూటింగ్ సమయంలో కూడా కొబ్బరి నీరు లేదా నిమ్మరసంతో హైడ్రేటెడ్ గా ఉంటుంది.
రష్మిక ఫిట్నెస్ జర్నీలో ప్రధానమైన విషయం ఏమిటంటే క్రమశిక్షణ అని చెప్తుంది. ఎంత బిజీ షెడ్యూల్ అయినా.. ఆమె వ్యాయామం కోసం సమయం కేటాయిస్తుంది. జిమ్‌కు వెళ్లలేకపోతే.. హోటల్ గదిలో స్ట్రెచ్ చేస్తుందట. ఆమెకు ఫిట్నెస్ కేవలం శారీరకమే కాదు.. మానసిక సమతుల్యతకు కూడా ఒక మార్గమని చెప్తుంది.
ఫిట్నెస్ అంటే బరువు తగ్గడమే కాదు.. లోపలి నుంచి దృఢంగా ఉండటమని నమ్ముతుంది రష్మిక.