Best Looks for Rakhi : రాఖీ పండక్కి అందంగా కనిపించాలనుకుంటే ఈ హీరోయిన్స్ లుక్స్ రీ-క్రియేట్ చేయండి
శ్రద్ధా కపూర్ ధరించిన ఈ వైట్ టిష్యూ సిల్క్ శారీ రాఖీ పండక్కి మంచి ఎంపిక. ఇది మిమ్మల్ని హెవీ లేకుండా హైలెట్ చేస్తుంది. సొగసైన, క్లాసిక్ లుక్ ఇస్తుంది.
ఇండో వెస్ట్రన్ లుక్ ట్రై చేయాలనుకుంటే.. సారా అలీ ఖాన్ లాగా పింక్ అనార్కలీ సెట్ ధరించవచ్చు. ఈ లుక్‌ని పోనీటైల్‌తో స్టైల్ చేస్తే మరింత అందంగా ఉంటుంది.
మీరు కొత్త పెళ్లి కూతురు అయితే.. పెళ్లి తర్వాత మొదటిసారిగా పుట్టింటికి వెళుతున్నట్లయితే.. కరీనా కపూర్ లాగా ఎరుపు రంగు చీరను ప్రయత్నించండి. ఇందులో మీరు మరింత అందంగా కనిపిస్తారు.
తెలుపు రంగు అందరికీ ఇష్టమైనది. మీరు రక్షాబంధన్ సందర్భంగా కియారా లుక్‌ని ట్రై చేయవచ్చు.
రక్షాబంధన్ సందర్భంగా మీరు భారీ దుస్తులు ధరించకూడదనుకుంటే.. కరీనా తరహాలో మల్టీకలర్ సైడ్ కుర్తా కూడా ట్రై చేయవచ్చు.
ఆలియా భట్ పింక్ శారీ లుక్ కూడా మంచి లుక్ ఇస్తుంది. రాఖీ పండుగకు మీరు ఇలాంటి లుక్ ట్రై చేయవచ్చు.
అనన్య పాండే ధరించిన ఈ నలుపు రంగు కో-ఆర్డ్ సెట్‌ను కూడా మీరు రాఖీ పండుగకు ప్రయత్నించవచ్చు. ఈ లుక్ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతుంది.
జాన్వీ కపూర్ లాగా పింక్ చీర కట్టుకుని రాఖీ పండుగకు ముస్తాబు అవ్వవచ్చు. నటిలాగే, మీరు కూడా జుట్టును వదులుగా ఉంచుకుని.. షైనీ మేకప్ లుక్‌తో ముస్తాబు అయితే బాగుంటారు.