Quick Cures for Hangovers : హ్యాంగోవర్? ఇవి తీసుకుంటే తగ్గిపోతుంది
మీ న్యూ ఇయర్ హ్యాంగోవర్‌తో స్టార్ట్ అవుతుందా? కంట్రోల్లో ఉండాలనుకుంటూనే ఎక్కువ తాగేసి.. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారా?
హ్యాంగోవర్ వల్ల తల పట్టేయడం, కడుపులో తిరగడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ రెమిడీలు మీకు వాటి నుంచి ఉపశమనం ఇస్తాయి.
ఉదయాన్నే నీరు లేదా కొబ్బరి నీరు తీసుకోండి. ఇది డీహైడ్రేషన్‌ను, తల నొప్పిని దూరం చేస్తుంది. శరీరానికి ఎనర్జీ ఇస్తుంది.
సిట్రస్ ఫ్రూట్స్, జ్యూస్‌లు తీసుకుంటే మంచిది. నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్ వంటి సిట్రస్ పానీయాలు హ్యాంగోవర్‌ను వేగంగా అధిగమించడంలో హెల్ప్ చేస్తాయి.
పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే మంచిది. బ్రేక్‌ఫాస్ట్‌గా గ్రీన్ సలాడ్స్ తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్‌గా ఉంటుంది.
అల్లం ముక్కలను నీటిలో మరిగించి లేదా అల్లం టీని తాగితే మీకు చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఇది మీ కడుపు నొప్పిని తగ్గించడమే కాకుండా.. వికారాన్ని తగ్గిస్తుంది.
పుదీనా అజీర్ణం, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం అందించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు హ్యాంగోవర్‌తో ఉన్నప్పుడు ఉదయాన్నే పుదీనా టీ కూడా తాగొచ్చు.