Protect Sperm Quality : స్పెర్మ్ నాణ్యత తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. వేసవిలో మగవారు ఫాలో అవ్వాల్సిన టిప్స్

వేసవిలో స్పెర్మ్ నాణ్యత కాపాడుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
అధిక ఉష్ణోగ్రతలు స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. హాట్ బాత్స్ లాంటివి చేయకూడదు. వృషణాల దగ్గర వేడి ఎక్కువగా ఉంటే క్వాలిటీ దెబ్బతింటుంది.
టైట్ అండర్‌వేర్ వేసుకోవడం వల్ల వేడి ఎక్కువగా నిలుస్తుంది. కాటన్, లూజ్ ఫిట్టింగ్ దుస్తులు వేసుకోవడం మంచిది.
వేడి వల్ల వచ్చే డీహైడ్రేషన్ శరీర పనితీరుపై ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి రోజూ తగినంత నీళ్లు తాగడం చాలా ముఖ్యం.
ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని వాడకండి. దాని నుంచి వచ్చే వేడి స్పెర్మ్ క్వాలిటీపై ప్రభావం చూపుతుంది.
వేసవిలో జింక్, విటమిన్ C, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం ఉండే పోషకాహారం తీసుకోవాలి. ప్రాసెస్‌డ్ ఫుడ్స్ వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది.
ధూమపానం, మద్యం తగ్గించండి. ఇవి స్పెర్మ్ కౌంట్, మొబిలిటీ తగ్గిస్తాయి. వేసవిలో ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
వ్యాయామం మంచిదే కానీ ఎక్కువగా వేడి పడేలా చేయకండి. మోస్తరు వ్యాయామం సరిపోతుంది.
ఒత్తిడి తగ్గించుకోండి. లేదంటే ఇది స్ట్రెస్ హార్మోన్లపై ప్రభావం చూపి స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. 7 నుంచి 8 గంటల నిద్ర తీసుకోవడం వల్ల హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి.
శరీరాన్ని చల్లగా ఉంచడం, నీరు ఎక్కువగా తాగడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వల్ల వేసవిలో కూడా స్పెర్మ్ నాణ్యతను కాపాడుకోవచ్చు.