PoSH Act : అమ్మాయి ఒక కంపెనీలో వర్క్ చేస్తూ.. వేరే ఆఫీస్‌లో చేస్తోన్న వ్యక్తిపై PoSH కంప్లైంట్ ఇవ్వవచ్చా?
వాస్తవానికి సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ జి కె మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. ఏమిటంటే బాధితురాలు ఫిర్యాదు చేయడానికి నిందితుడి శాఖ ఐసీసీ వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. మహిళ తన స్వంత కార్యాలయంలోని ఐసీసీలో ఫిర్యాదు చేయవచ్చు. నిందితుడు వేరే శాఖలో లేదా కంపెనీలో పని చేస్తున్నప్పటికీ.
ఇలాంటి ఓ సంఘటన 15 మే 2023 జరిగింది. ఇందులో ఒక IAS అధికారి న్యూఢిల్లీలోని కృషి భవన్‌లోని తన కార్యాలయంలో ఒక IRS అధికారి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. అనంతరం బాధితురాలు తన విభాగంలోని ICCకి PoSH చట్టం కింద ఫిర్యాదు చేశారు. FIR కూడా నమోదు చేశారు.
మహిళ ఫిర్యాదు మేరకు.. నిందితుడైన ఐఆర్ఎస్ అధికారి తాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఉద్యోగినని.. అందువల్ల ఈ విభాగం ఐసిసి మాత్రమే ఫిర్యాదును విచారించే అధికారం కలిగి ఉందని వాదించాడు. అయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ వాదనను తోసిపుచ్చాయి.
సుప్రీం కోర్ట్ చెప్పింది ఏమిటంటే.. PoSH చట్టంలో కార్యాలయ నిర్వచనం చాలా విస్తృతమైనది. ఇందులో కేవలం కార్యాలయ ప్రాంగణం మాత్రమే కాకుండా ఉద్యోగ సమయంలో లేదా ఉద్యోగం కారణంగా సందర్శించిన ఏదైనా ప్రదేశం కూడా ఉంటుంది. అందువల్ల కార్యాలయానికి సరైన వివరణ ఇస్తే సరిపోతుంది.
కోర్టు స్పష్టం చేసింది ఏంటంటే PoSH చట్టంలో నిందితుడు.. బాధితురాలు పనిచేసే కార్యాలయంలోనే ఉద్యోగి అయి ఉండాలనే నిబంధన ఏదీ లేదు. ఏ వ్యక్తి మీదైతే మహిళ తన కార్యాలయ ICCలో ఫిర్యాదు చేస్తుందో.. అతన్ని PoSH చట్టం ప్రకారం ప్రతివాదిగా పరిగణిస్తారు.
కోర్టు ప్రకారం బాధితురాలి కార్యాలయం ఐసిసి పోష్ చట్టం కింద ప్రారంభ లేదా తొలి విచారణను నిర్వహించవచ్చు. దీని తరువాత నిందితుడిపై చర్యలు తీసుకుంటే, నిందితుడి విభాగం ఐసిసి అధికారిక విచారణకు అధికారం వహిస్తుంది.
ఆ తీర్పు తర్వాత ఒక మహిళ తన కార్యాలయంలో కాకుండా బయట కంపెనీ వ్యక్తి నుంచి లేదా ఇతర విభాగాల్లోని ఉద్యోగుల వల్ల వేధింపులకు గురైతే.. ఆమె తన కార్యాలయంలోని ICCలో ఫిర్యాదు చేయవచ్చని, న్యాయం కోసం ఇతర సంస్థలకు వెళ్లవలసిన అవసరం లేదని స్పష్టమైంది.