Malala Wedding: కొత్త జీవితం ప్రారంభం... హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మలాలా అండ్ అసర్
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అస్సర్ అనే వ్యక్తిని పెళ్లాడినట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. (Image credit: Twitter)
‘ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. అస్సర్, నేను జీవిత భాగస్వాములుగా మారాం. బర్మింగ్హమ్ లోని మా ఇంట్లో మా కుటుంబాల సాక్షిగా నిఖా వేడుకను పూర్తిచేశఆం. మీ ఆశీస్సులు మాకు కావాలి’ అంటూ ఫోటోలను పోస్టు చేయడంతో పాటూ తన పెళ్లి వార్తను ప్రపంచానికి చెప్పింది మలాలా. (Image credit: Twitter)
అస్సర్ గురించి ఎలాంటి సమాచారాన్ని మలాలా బయటపెట్టలేదు. కానీ తెలిసిన మేరకు అతను పాకిస్థాన్ కు చెందిన వ్యక్తేనని, పాక్ క్రికెట్ బోర్డులో పెద్దస్థాయి ఉద్యోగి అని మాత్రం తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో కూడా తెలియదు. (Image credit: Twitter)
మలాలా 17 ఏళ్ల చిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. పాక్ లోని స్వాత్ లోయలో నివసించే ఈమె ఆడపిల్లల విద్యకోసం పాటు పడింది. దీంతో తాలిబాన్లు ఆమెను కాల్చారు. చికిత్స కోసం ఆమెను బ్రిటన్ తరలించారు. అనంతరం బ్రిటన్లోనే స్థిరనివాసం ఏర్పరచుకుంది మలాలా కుటుంబం. (Image credit: Twitter)