Black Coffee : కాలేయ సమస్యలను దూరం చేసే బ్లాక్ కాఫీ.. రోజుకు రెండు కప్పులు తాగితే ఎన్ని ప్రయోజనాలో
జాన్స్ హాప్కిన్ నివేదిక ప్రకారం.. రోజుకు రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగడం వల్ల కాలేయ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందట. అంతేకాకుండా మెదడుకు సంబంధించిన అనేక వ్యాధులు తగ్గుతాయట. (Image Source : Freepik)
బ్లాక్ కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ వాపు, నష్టాన్ని తగ్గించి.. లివర్ని రక్షించడంలో హెల్ప్ చేస్తుందట. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రమాదాన్ని 71 శాతం తగ్గిస్తుందట.(Image Source : Freepik)
బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా కంట్రోల్ అవుతాయని చెప్తున్నారు. (Image Source : Freepik)
కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో బ్లాక్ కాఫీ వండర్స్ చేస్తుంది. (Image Source : Freepik)
కాలేయ ఎంజైమ్లు, వాపును తగ్గించడమే కాకుండా.. గుండె సమస్యలను దూరం చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. (Image Source : Freepik)
టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించి.. బరువును కంట్రోల్ చేయడంలో బ్లాక్ కాఫీ మంచి ఫలితాలు ఇస్తుంది. (Image Source : Freepik)