Liver Health : లివర్ని డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. అవి తింటే కాలేయ సమస్యలు తప్పవు
కాలేయ హెల్త్ పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాని సంరక్షణ చాలా అవసరం. జీవనశైలిలో మార్పులతో పాటు తీసుకునే ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి.
కొన్ని ఫుడ్స్ నోటికి మంచి రుచిని ఇచ్చినా.. కాలేయాన్ని తీవ్రంగా నష్టపరుస్తాయి. కేవలం ఆల్కహాల్ మాత్రమే కాదు కొన్ని రకాల ఆహారం కూడా లివర్ హెల్త్‌ని దెబ్బతీస్తుంది.
అధికంగా చక్కెర తీసుకోవడం, స్వీట్స్‌ని ఎక్కువగా తినడం వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. విటమిన్ ఎ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా లివర్‌కు నష్టమే జరుగుతుంది.
గోధమ పిండి, మైదా పిండి వంటి పిండి పదార్థాల్లోని కార్బ్స్ కాలేయ ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. రెడ్ మీట్ కూడా లివర్ హెల్త్‌కి మంచిది కాదు.
కొన్నిరకాల పెయిన్ కిల్లర్స్ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కూడా కాలేయంపై చెడు ప్రభావం ఉంటుంది. కాబట్టి వాటిని తక్కువ మోతాదులో వినియోగించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.