Janhvi Kapoor : జాన్వీ కపూర్ వయసెంతో తెలుసా? అందాల ఫిట్నెస్, బ్యూటీ టిప్స్ ఇవే
హీరోయిన్ జాన్వీ కపూర్ మార్చి 6వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటుంది. అభిమానులు, సెలబ్రెటీలు ఆమెకు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్తున్నారు. ఇంతకీ ఈ భామ వయసు ఈ ఏడాదితో ఎంతో తెలుసా?(Images Source : Instagram/Janhvi Kapoor)
2025తో జాన్వీ కపూర్ 28వ బర్త్ డే జరుపుకుంటుంది. ప్రతి అమ్మాయి తన ఫిట్నెస్, బ్యూటీ టిప్స్ కోసం ఈ భామ చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. (Images Source : Instagram/Janhvi Kapoor)
జాన్వీ కపూర్ ఫిట్నెస్, బ్యూటీ విషయాల్లో అస్సలు రాజీపడదు. అందుకే ఈ భామకు అమ్మాయిలు, అబ్బాయిల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. బ్యూటీ కోసం కూడా ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోగలిగే స్కిన్‌కేర్ టిప్స్‌ని ఫాలో అవుతుంది. (Images Source : Instagram/Janhvi Kapoor)
చల్లని నీటితో ముఖాన్ని వాష్ చేసుకుంటుంది. అలాగే ఓపెన్ పోర్స్‌ని కంట్రోల్ చేయడానికి ముఖానికి ఆవిరి పడుతుంది. ఫ్రూట్స్‌తో రకరకాల ఫేస్‌మాస్కులు ట్రై చేస్తుందటం. తేనే, వెన్నను కూడా బ్యూటీ రిపేర్ కోసం వాడుతుంది. (Images Source : Instagram/Janhvi Kapoor)
ముఖంపై పేరుకుపోయిన టాన్‌ను తొలగించేందుకు నారింజను ఉపయోగిస్తుందట. దాని రసాన్ని ముఖానికి అప్లై చేయడం, పెరుగు, తేనెతో కూడిన ప్యాక్స్ వేసుకోవడం చేస్తుందట. ఐస్ క్యూబ్స్‌తో ముఖానికి మసాజ్ చేస్తుందట. బాదం నూనెను ముఖానికి రెగ్యులర్‌గా అప్లై చేస్తుందట జాన్వీ. (Images Source : Instagram/Janhvi Kapoor)
ఫిట్నెస్ కోసం జిమ్ని ఆశ్రయిస్తుంది జాన్వీ. పిలెట్స్, బ్లాలెన్స్ వ్యాయామాలు, రన్నింగ్, కార్డియో ఎక్కువగా చేస్తుంది జాన్వీ. (Images Source : Instagram/Janhvi Kapoor)
యోగా, మెడిటేషన్‌తో పాటు తన ఫిట్నెస్ రొటీన్లో భాగంగా డ్యాన్స్ కూడా చేస్తుంది. అలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ డైట్లో ఎక్కువగా ఉండేలా చూస్తుంది జాన్వీ. వెకేషన్‌కి వెళ్లినా.. వ్యాయామాన్ని వదలదట ఈ భామ. (Images Source : Instagram/Janhvi Kapoor)