iPhone 16 Pro : 50 వేల రూపాయల కంటే తక్కువ ధరకే iPhone 16 Pro Max.. ఇక్కడ కొంటే ఎక్కువ ఆదా అవుతుందట
iPhone 16 Pro Max పై భారీ డిస్కౌంట్ తీసుకొచ్చింది Flipkart Big Billion Days sale. సెప్టెంబర్ 23న ప్రారంభం కానున్న ఈ సేల్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 16 సొంతం చేసుకోవచ్చట.
ఈ విధంగా అన్ని ఆఫర్లను కలిపి iPhone 16 Pro Maxని 49,999 రూపాయల కంటే తక్కువ ధరకు కొనడం సాధ్యమవుతుంది. మీ పాత స్మార్ట్ ఫోన్ పరిస్థితిని బట్టి ఎక్స్ఛేంజ్ విలువ ఉంటుందని గుర్తించుకోవాలి.
iPhone 16 Pro Max 6.9 అంగుళాలు స్క్రీన్ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz ProMotion టెక్నాలజీతో చాలా స్మూత్ ఎక్స్‌పీరియ్స్ అందిస్తుంది. A18 Pro chipతో వస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్‌తో పాటు AI ఫీచర్స్‌తో కూడా వస్తుంది.
ఇందులో 48MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇవి 5x ఆప్టికల్ జూమ్ వరకు సపోర్ట్ చేస్తాయి. ముందు భాగంలో 12MP ట్రూ డెప్త్ కెమెరా ఉంది. ప్రత్యేకత ఏమిటంటే ఇందులో కొత్త కెమెరా కంట్రోల్ బటన్ ఉంది. దీని ద్వారా షార్ట్‌కట్స్ ద్వారా వివిధ షూటింగ్ మోడ్లు, సెట్టింగ్లను తక్షణమే యాక్సెస్ చేయవచ్చు.
డిజైన్ విషయానికొస్తే.. ఈ ఫోన్ తేలికైన, దృఢమైన టైటానియం ఫ్రేమ్‌తో వస్తుంది. దీని రక్షణ కోసం నెక్స్ట్-జెనరేషన్ సిరామిక్ షీల్డ్ ఉపయోగించారు. ఇప్పటివరకు అత్యంత బలమైన స్మార్ట్‌ఫోన్ గ్లాస్‌గా దీనిని పరిగణించవచ్చు. స్టోరేజ్ 256GB, 512GB, 1TB వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అంటే ఈ సేల్‌లో iPhone 16 Pro Max కొనడం ఇక కల మాత్రమే కాదు.. సరైన ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో ఇది మీ బడ్జెట్‌లోకి రావచ్చు.
Flipkartలో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5Gపై కూడా పెద్ద డిస్కౌంట్ ఉంది. ఫోన్ 12+256GB వేరియంట్ 1,34,999 రూపాయలు కానీ.. ఇక్కడ 40 శాతం డిస్కౌంట్‌తో లిస్ట్ చేశారు. డిస్కౌంట్ తర్వాత అన్ని తీసేయగా.. 79,999 రూపాయలకు కొనుక్కోవచ్చు.