Uric Acid : యూరిక్ యాసిడ్ని సహజంగా తగ్గించే ఫుడ్స్ ఇవే.. లేదంటే నొప్పులు తప్పవు

యూరిక్ యాసిడ్ని తగ్గించే ఫుడ్స్
గ్రీన్ టీ యూరిక్ యాసిడ్ తగ్గించడానికి ఉత్తమమైన ఎంపిక అవుతుంది. దీనిలో EGCG, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. వాపును కంట్రోల్ చేస్తాయి.
చెర్రీ పండ్లు కూడా యూరిక్ యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. శరీరం నుంచి దానిని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి, వాపును తగ్గిస్తాయి.
నిమ్మ, నారింజ, స్వీట్ లైమ్ విటమిన్ సితో సమృద్ధిగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ ను నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరాన్ని ఆల్కలైన్ చేస్తాయి.
కీరదోసకాయలో నీటి శాతం ఎక్కువ. ఇది యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. వాపును తగ్గిస్తుంది.
అవిసె గింజలలోని పీచు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యూరిక్ ఆమ్లాన్ని బయటకు పంపడానికి సహాయం చేస్తాయి. కీళ్ల వాపును తగ్గించడానికి సహాయపడతాయి.