Weight Loss : బరువు తగ్గాలని వేడి నీటిని తాగుతున్నారా? అయితే జాగ్రత్త మీ హెల్త్ కరాబ్ అవ్వొచ్చు
కొందరు ఎంత ఎక్కువ వేడి నీరు తీసుకుంటే అంత త్వరగా కొవ్వు తగ్గుతుందని భావిస్తారు. ఎక్కువ వేడి నీరు తాగడం వల్ల కొవ్వు కరగడం కాదు.. నోరు, గొంతు, పొట్ట లోపలి పొర దెబ్బతినవచ్చు.
ఉదయం లేవగానే ఏమీ తినకుండా బాగా వేడిగా ఉండే నీరు తాగడం వల్ల కడుపులో ఎక్కువ ఆమ్లం ఏర్పడవచ్చు. దీనివల్ల వికారం, వాంతులు లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు.
భోజనం చేసిన వెంటనే వేడి నీరు తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుందని భావిస్తారు. ఇది శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
గంట గంటకు వేడి నీరు తాగడం వల్ల మీ కిడ్నీలపై ఒత్తిడి పెరిగి.. శరీరంలోని ముఖ్యమైన ఖనిజాలు బయటకు వెళ్లిపోవచ్చు. దీనివల్ల శరీరంలో బలహీనత, అలసట కూడా కలుగుతుంది.
మరిగే నీటిని తాగితే.. నోటిలోని పొరలను కాలిపోతాయి. ఇది లాలాజలం సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీర్ఘకాలికంగా ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు కూడా వస్తాయి.
ఇంటర్నెట్ చూసి వేడి నీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు. ప్రతి వ్యక్తి శరీరం, వాతావరణం, ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటాయి. కాబట్టి వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలి.