Hair Fall Causes in Rain : వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతుందా? బట్టతల తప్పదా? హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు?
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. దీని కారణంగా స్కాల్ప్‌లో మురికి పేరుకుపోతుంది. బ్యాక్టీరియా ప్రమాదం పెరుగుతుంది. ఈ విధంగా జుట్టు రాలడం సమస్య మొదలవుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవర్షాకాలంలో హెయిర్‌ఫాల్ గురించి ప్రసిద్ధ చర్మవ్యాధి నిపుణుడు, హెయిర్ ఎక్స్పర్ట్ అంకుర్ సరీన్.. తన యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియోను షేర్ చేశారు. వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలతో పాటు.. ముఖ్యంగా జుట్టు రాలడం సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వీడియోలో తెలిపారు. అయితే కొన్ని సులభమైన చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల ఈ సమస్య దూరమవుతుంది.
డాక్టర్ సరీన్ ప్రకారం.. వర్షాకాలంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వారానికి రెండుసార్లు నూనె రాయడం అవసరం. నూనె రాయడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. ఇది నష్టం జరగకుండా కాపాడుతుంది.
వర్షాకాలంలో జుట్టు ఇప్పటికే బలహీనంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్నర్లు, కర్లింగ్ ఐరన్ వంటి హీటింగ్ టూల్స్ ఉపయోగించడం వల్ల జుట్టుకు మరింత నష్టం వాటిల్లుతుంది. ఈ టూల్స్ జుట్టు సహజ తేమను తగ్గిస్తాయి. వాటిని మరింత దెబ్బతీస్తాయి. అందుకే డాక్టర్ సరీన్ వీటిని ఉపయోగించకుండా ఉండాలని సలహా ఇస్తున్నారు.
జుట్టు ఆరబెట్టడానికి సాధారణ టవల్స్కు బదులుగా మైక్రోఫైబర్ టవల్స్ లేదా కాటన్ టీ-షర్ట్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ పద్ధతి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
జుట్టును స్ట్రెయిట్నింగ్, రీబౌండింగ్ లేదా ఇతర కెమికల్ చికిత్సల వల్ల జుట్టు మూలాలకు నష్టం వాటిల్లుతుంది. వర్షాకాలంలో ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు.
ఆహారంలో అవసరమైన పోషకాలు అందకపోతే.. బయోటిన్, జింక్, విటమిన్ E వంటి సప్లిమెంట్లు తీసుకోవచ్చు. అయితే ఏదైనా సప్లిమెంట్ తీసుకునే ముందు.. నిపుణుడి సలహాలు తీసుకోవడం ముఖ్యం. తద్వారా జుట్టు ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని తెలిపారు.
అబ్బాయిలలో జుట్టు రాలడం సమస్య ఉంటే.. వర్షాకాలంలో బట్టతల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జుట్టు పలుచగా ఉంటూ లేదా పాక్షికంగా బట్టతల ఉంటే.. వర్షాకాలంలో మిగిలిన జుట్టును కూడా బలహీనపడుతుంది.