Cracked Heels : కాళ్లు పగుళ్లు వస్తున్నాయా? అందమైన పాదాలకోసం ఈ టిప్స్ ఫాలో అయిపోండి
చలికాలంలో మడమల సంరక్షణలో మొదటి మెట్టు శుభ్రత. దీని కోసం ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేయాలి. మీ పాదాలను 10 నుంచి 15 నిమిషాల వరకు దానిలో ఉంచాలి. ఇది మడమలపై ఉన్న చనిపోయిన, గట్టి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. తరువాత ప్యూమిక్ స్టోన్ లేదా బ్రష్తో రుద్దండి. ఈ పద్ధతి పొడిబారడాన్ని తగ్గిస్తుంది. పాదాలకు ఉపశమనం కలుగుతుంది.
కొబ్బరి నూనె ఒక అద్భుతమైన సహజ మాయిశ్చరైజర్. రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగండి. ఆరిన తర్వాత మడమల మీద కొబ్బరి నూనెతో 5 నిమిషాలు మసాజ్ చేయండి. ఇది చర్మం లోపలి పొరల వెళ్లి తేమను నిలుపుతుంది. పగుళ్లను నింపడానికి సహాయపడుతుంది. రోజూ చేస్తే మడమలు త్వరగా నయం అవుతాయి.
నిమ్మకాయలో ఉండే సహజ ఆమ్లం చనిపోయిన చర్మాన్ని తొలగిస్తుంది. అయితే వాసెలిన్ పాదాలను మృదువుగా చేస్తుంది. ఒక టీస్పూన్ వాసెలిన్లో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. రాత్రి సమయంలో మడమల మీద రాసి సాక్స్ ధరించండి. ఈ మిశ్రమం రాత్రంతా చర్మానికి పోషణనిస్తుంది. పగుళ్లను త్వరగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది.
గ్లిసరిన్, రోజ్ వాటర్ మిశ్రమం పాదాల పగుళ్లను ప్రభావవంతంగా తగ్గిస్తుంది. రెండు చెంచాల గ్లిసరిన్లో ఒక చెంచా రోజ్ వాటర్ కలిపి మడమల మీద రాయండి. గ్లిసరిన్ చర్మంలో తేమను నింపుతుంది. రోజ్ వాటర్ చల్లదనాన్ని, మృదుత్వాన్ని ఇస్తుంది. మడమలు బాగా పగిలిపోతే దీన్ని రోజూ వాడండి.
పండిన అరటిపండు చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్. ఒక పండిన అరటిపండును మెత్తగా చేసి పేస్ట్ చేయండి. దీన్ని మడమల మీద 15–20 నిమిషాలు ఉంచి.. గోరువెచ్చని నీటితో కడగాలి. అరటిపండులో ఉండే విటమిన్లు చర్మాన్ని మృదువుగా, నునుపుగా చేస్తాయి. కొన్ని రోజుల్లోనే తేడా కనిపిస్తుంది.
చాలామంది మడమల సంరక్షణలో ఈ విషయాన్ని మరచిపోతారు. స్నానం చేసిన తర్వాత లేదా కాళ్లు కడిగిన తర్వాత వాటిని బాగా ఆరబెట్టడం చాలా ముఖ్యం. తడి లేదా తేమతో కూడిన మడమలు పగుళ్లు ఎక్కువగా వస్తాయి. కాబట్టి పాదాలు శుభ్రంగా, పొడిగా ఉంచుకోండి. ఇది పాదాలు పగుళ్ల సమస్యను చాలా వరకు తగ్గిస్తాయి.