✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Dog Bite Risks : కుక్క కరిస్తే ఎన్ని గంటల్లోపు ఇంజెక్షన్ వేయించుకోవాలి? లేకుంటే రేబిస్​తో పాటు ఆ వ్యాధులు తప్పవు

Geddam Vijaya Madhuri   |  27 Aug 2025 05:42 PM (IST)
Dog Bite Risks : కుక్క కరిస్తే ఎన్ని గంటల్లోపు ఇంజెక్షన్ వేయించుకోవాలి? లేకుంటే రేబిస్​తో పాటు ఆ వ్యాధులు తప్పవు

కుక్క కరిస్తే ఈ ప్రమాదాలు తప్పవు

1

కుక్క కరిచినప్పుడు వచ్చే అతి పెద్ద ప్రమాదకరమైన సమస్య రేబిస్. ఈ వైరస్ మెదడు, నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. సమయానికి ఇంజెక్షన్లు తీసుకోకపోతే ఇది ప్రాణాంతకం అవుతుంది.

2

కుక్క దంతాలు, గోళ్ల ద్వారా గాయమైతే.. వాటిపై ఉన్న బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి టెటనస్​ను కలిగిస్తుంది. ఇది కండరాలు బిగుసుకుపోయేలా చేసి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది.

3

కుక్క నోటిలో ఉండే బాక్టీరియా గాయంలోకి వెళ్లి.. ఎర్రని వాపు, చీముకు కారణమవుతుంది. చాలాసార్లు ఈ ఇన్ఫెక్షన్ శరీరంలోకి వ్యాప్తి చెంది సెప్సిస్ ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది.

4

కుక్క కరిచిన తర్వాత కొందరికి చర్మంపై అలెర్జీ ప్రతిచర్యలు రావచ్చు. గాయం చుట్టూ దురద, ఎర్రటి దద్దుర్లు, తీవ్రమైన మంట లక్షణాలు ఉంటాయి.

5

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే.. కుక్క కరిచిన 24 గంటలలోపు రేబిస్ మొదటి ఇంజక్షన్ వేయించుకోవాలంటున్నారు వైద్యులు. ఆలస్యం చేస్తే వైరస్ శరీరంలోకి వ్యాప్తి చెందుతుంది.

6

రేబిస్ రాకుండా ఉండాలంటే.. 4 నుంచి 5 ఇంజెక్షన్లు వేస్తారు. శరీరము వైరస్​తో పోరాడే సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం వేర్వేరు రోజుల్లో ఇస్తారు.

7

కుక్క కరిస్తే వెంటనే గాయాన్ని సబ్బు, నీటితో బాగా కడగాలి. ఇంటి చికిత్సలకు బదులుగా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి ఇంజెక్షన్ చేయించుకోవాలి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Dog Bite Risks : కుక్క కరిస్తే ఎన్ని గంటల్లోపు ఇంజెక్షన్ వేయించుకోవాలి? లేకుంటే రేబిస్​తో పాటు ఆ వ్యాధులు తప్పవు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.