Most Break Up Phase : ఎక్కువమంది రిలేషన్స్ ఎక్కడ బ్రేక్ అవుతాయో తెలుసా? కారణాలు ఇవే
హార్ట్ బ్రేక్ అనేది ఎవరూ తప్పించుకోలేని అనుభవం. రిలేషన్ ముగిసినప్పుడు మనం కారణాలను వెతకడం ప్రారంభిస్తాము. అయితే మీకు తెలుసా? చాలా సంబంధాలు ఏ దశలో బ్రేక్ అవుతాయో తెలుసా?
ఏ రిలేషన్ ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు. రిలేషన్లో ఉన్నప్పుడు మీరు సేఫ్ జోన్‌లో ఉన్నారా లేదా బ్రేక్ అవుతుందా అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. ఒక తప్పు వల్ల రిలేషన్ పాడైపోతుంది అనుకుంటే.. ఒక టైమ్‌లైన్ ఉంటే బాగుండేది. అలా జరగకుండా చూసుకునేవాళ్లం అని అనుకుంటారు.
నిజం ఏమిటంటే.. కొన్ని సంబంధాలు బ్రేక్ అవ్వడానికి సరైన రీజన్ ఉండదు. కానీ కొన్ని తెలుస్తూ ఉంటాయి. అవన్నీ బ్రేకప్ అవ్వడానికి కారణమవుతాయి. వాటిలో తెలిసే చేసే తప్పులు ఉంటాయి. తెలియకచేసేవి కూడా ఉంటాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా జంటలు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే హనీమూన్ ఎండ్ దశలో పెద్ద గొడవను ఎదుర్కొంటారు. 3 నుంచి 5 సంవత్సరాల రిలేషన్లో ఇప్పుడు ఏమిటి? అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. 7 సంవత్సరాల సమయంలో ఒంటరితనం, ఉద్యోగం, డబ్బు లేదా షిఫ్టింగ్ వంటివి రిలేషన్‌పై ఒత్తిడి చేస్తాయి. ఇవన్నీ ఏ దశలోనైనా మిమ్మల్ని బలహీనపరుస్తాయి. ఈ సమయంలో మీ రిలేషన్ నిలబెట్టుకోవాలంటే మీరు పాటించాల్సిన అతి ముఖ్యమైన అంశం కమ్యూనికేషన్. ఇది మీ రిలేషన్ కొనసాగాలా? వద్దా అనేది డిసైడ్ చేస్తుంది.
రిలేషన్ షిప్లో కొన్ని స్టేజ్‌లు ఉంటాయి. ప్రతి జంట దీనిని అనుసరిస్తారని అర్థం కాదు. కానీ సంబంధాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. ప్రతి సంబంధం దాని ర్యాపోతో ముందుకు సాగుతుంది. కొన్నిసార్లు వేగంగా, కొన్నిసార్లు లేట్‌గా, చాలాసార్లు ఎటువంటి నమూనా లేకుండా ముందుకు వెళ్తుంది.
ఇన్ఫాచుయేషన్ దశ అనేది అంతా బాగానే ఉంటుంది అనిపించే సమయం. రియాలిటీలోకి వచ్చినప్పుడు అసలు ప్రపంచం ముందుకొస్తుంది. లోపాలు కనిపిస్తాయి. తర్వాత గొడవలు మొదలవుతాయి. రిలేషన్ షిప్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా జంటలు ఈ దశలోనే ఎక్కువగా విడిపోతారట.
ఈ దశను దాటిన వారు కట్టుబాట్లు, భాగస్వామ్య దశకు చేరుకుంటారు. ఇక్కడ రిలేషన్ నమ్మకం, అవగాహన, ఇద్దరి ఎఫర్ట్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇదే నేను, నువ్వు కలిసి మనంగా మారే స్థాయి. వివాహం, పిల్లలు లేదా కలిసి ఫ్యూచర్ వంటివి ఆలోచిస్తారు.