Tips to Store Coriander : కొత్తిమీర పాడవకుండా ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
మీకు కొత్తిమీర ఇష్టమా? అయితే దానిని స్టోర్ చేయడం మీకు పెద్ద టాస్క్‌గా మారిందా? అయితే మీరు ఈ సింపుల్ హ్యాక్స్ గురించి తెలుసుకోవాలి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొత్తిమీర బయటఉంచితే త్వరగా పాడవుతుంది. ఫ్రిడ్జ్‌లో సరిగ్గా స్టోర్ చేయకుండా పాడైపోతుంది. అలాంటివారు కొన్ని టిప్స్ ఫాలో అయితే కొత్తిమీరను తాజాగా ఉంచుకోవచ్చు.
కొత్తమీరను స్టోర్ చేసుకునే ముందు తాజాగా ఉండే దానిని చూసుకోవాలి. పండుతున్నా, వాడిపోయినా, పాడైపోయిన ఆకులను వేరు చేసి.. కేవలం పచ్చగా ఉన్న ఆకులను మాత్రమే తీసుకోవాలి.
కొత్తిమీర ఆకులను వేరు చేసి.. కాడలను పారేస్తూ ఉంటారు. కానీ కాడలతో ఆకులు ఉంటే ఎక్కువకాలం ఫ్రెష్‌గా ఉంటాయి.
కొత్తిమీరను మురికి పోయేవరకు కడిగి.. నీళ్లు వాడేలా ఆరబెట్టుకోవాలి. పేపర్ టవల్లో చూడితే తడి తగ్గుతుంది.
ఈ కొత్తిమీరను కంటైనర్‌లో లేదా ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి.. కట్టేయాలి. ఇలా చేస్తే వారం వరకు కొత్తిమీర ఫ్రెష్‌గా ఉంటుంది. అయితే కొత్తమీర ఏమాత్రం తడిలేకుండా ఉండాలి.
కొత్తిమీర ఆకులను ఎయిర్‌టైట్ కంటైనర్‌లో వేసి లేదా ఐస్‌క్యూబ్ ట్రేలలో ప్రిజర్వ్ చేసి 6 నెలల వరకు కొత్తిమీరను ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు.
కొత్తిమీరను డార్క్ ప్లేస్‌లో స్టోర్ చేసుకోవాలి. సన్‌లైట్ పడితే కొత్తిమీర త్వరగా పాడైపోతుంది. తడిలేని ప్రదేశాల్లో ఉంచితే ఎక్కువ కాలం ఉంటుంది.
కాడలు కట్ చేయకుండా.. ఓ గ్లాస్లో నీటిని వేసి.. దానిలో కొత్తిమీరను వేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా కొత్తిమీర ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది.
తడిలేకుండా కొత్తిమీరను పేపర్ బ్యాగ్‌లో చుట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినా ఎక్కువరోజులు నిల్వ ఉంటుంది.