Festive Gold Shopping Guide : పండుగల సమయంలో బంగారం కొనేప్పుడు ఈ తప్పులు చేయకండి.. లేకపోతే మీకే నష్టం
పండుగల సమయంలో బంగారం కొనేప్పుడు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే ప్యూరిటీ చెక్ చేయకపోవడమే. చాలా మంది దుకాణదారులు 22 లేదా 24 క్యారెట్ల బంగారం పేరుతో మిశ్రమ లోహాన్ని అమ్ముతారు. దీనివల్ల ధర ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అలాగే బంగారం స్వచ్ఛంగా ఉండదు. అందుకే ఎప్పుడూ మీరు నమ్మే జ్యూవెలరీ షాప్ నుంచే కొనండి. దీనివల్ల మీరు ఎక్కువ ధర చెల్లించాల్సిన అవసరం ఉండదు.
మీ పార్టనర్‌కు రింగ్, గాజులు వంటివి కొనాలనుకుంటే.. సైజును అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. ఇది చాలామంది సర్ప్రైజ్ ఇద్దామని చేసే మరో తప్పు. కాబట్టి ఉంగరం లేదా బ్రేస్లెట్, గాజులు కోసం సరైన సైజు ముందే తెలుసుకోవాలి. సరైన సైజు కాకుండా అసౌకర్యంగా ఉంటుంది. దానిని తిరిగి మార్చుకోవడం కూడా సులభం కాదు.
పండుగల సమయంలో బంగారం ధరలలో మార్పులు కనిపిస్తాయి. చాలాసార్లు దుకాణదారులు పండుగల సమయంలో ధరలను పెంచుతారు. ఇది మీకు ఓ రకంగా నష్టమే. కాబట్టి కొనుగోలు చేసే వివిధ దుకాణాలలో రేట్లను చెక్ చేసుకోండి.
ఆభరణాల డిజైన్ చూసి తొందరపడి కొనడం కూడా ప్రమాదకరమే. కొన్నిసార్లు డిజైన్ పాతది లేదా నకిలీ రాళ్లతో కూడుకున్నది కావచ్చు. ఎల్లప్పుడూ ఆభరణాల రాళ్లు, డిజైన్ నాణ్యతను చెక్ చేయండి. ఇది ఎక్కువ కాలం ఉపయోగించడానికి అవసరం.
ఎవరైనా బంగారు ఆభరణాలు కొన్నప్పుడు బిల్లు, సర్టిఫికెట్ తీసుకోవాలి. ప్రతి ఆభరణంతో బిల్లుతో పాటు ప్యూరిటీ సర్టిఫికెట్ ఉండేలా చూసుకోవాలి. భవిష్యత్తులో తిరిగి అమ్మవలసి వస్తే లేదా ఆభరణాలకు సంబంధించి ఏదైనా వివాదం ఏర్పడితే ఇవి హెల్ప్ అవుతాయి.
చాలామంది పండుగల సమయంలో చౌకగా బంగారం ఇస్తారు. ఇదేదో స్కీమ్ కింద ఇస్తారు అనుకుంటారు కానీ.. ఆ సమయంలో కల్తీ బంగారం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి గోల్డ్ ఎప్పుడూ కంగారుగా కాకుండా.. సమయం తీసుకుని కొంటే మంచిది.