Chapati Making Tips : చపాతీలు మెత్తగా రావాలి.. గట్టిగా కాకూడదంటే పిండి కలిపేటప్పుడు ఈ తప్పులు చేయకండి

చపాతీలు మెత్తగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
చపాతీని చాలామంది తమ డైట్లో తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్లో కూడా చపాతీలు తినేవారు ఉన్నారు.
చపాతీలు చేసుకునేందుకు రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. కానీ ప్రతిరోజూ చపాతీలు చేసేటప్పుడు పిండిని కలిపే పద్ధతిలో కొన్ని తప్పులు చేస్తారు. దీనివల్ల అవి గట్టిగా అయిపోతాయి.
పిండిని సరిగ్గా కలపకపోతే చపాతీలు మెత్తగా రావు. పొంగవు. మీరు కూడా చపాతీలు మెత్తగా రావాలి.. ఎక్కువసేపు మంచిగా ఉండాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి.
చపాతీల కోసం పిండిని కలిపేటప్పుడు పిండిని బాగా కలపండి. 8 నుంచి 10 నిమిషాల పాటు కలిపితే పిండి బాగా మృదువుగా మారుతుంది.
అలాగే పిండిని కలిపేటప్పుడు చల్లటి నీటిని ఉపయోగించవద్దు. వీలైతే గోరువెచ్చని నీటిని వాడండి. పిండిని కలిపిన వెంటనే చపాతీలు చేయవద్దు. లేదంటే మీరు పిండిని కలిపేటప్పుడు అందులో కొద్దిగా పాలు కూడా వేసుకోవచ్చు.
చపాతీలు చేసేటప్పుడు మెల్లగా చేయండి. అంచులు మందంగా చేయకూడదు. చపాతీలు కాల్చేటప్పుడు ముందుగా పెనాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత చపాతీలు కాల్చండి. గ్యాస్ మంటను మరీ ఎక్కువగా పెట్టకూడదు.
చపాతీలు చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే అవి మెత్తగా, పొంగుతూ వస్తాయి. అలాగే ఎక్కువకాలం ఫ్రెష్‌గా, మెత్తగా ఉంటాయి.