Guava Leaves for Diabetes : జామ ఆకులు తింటే మధుమేహం తగ్గుతుందా? నిపుణుల సలహాలు ఇవే
మధుమేహం ఉన్నవారు వైద్యులు సూచించే మందులతో పాటు.. ఆహారంపై శ్రద్ధ వహించాలి. రక్తంలోని చక్కెరను సమతుల్యం చేయడంలో ఫుడ్ కీలకపాత్ర పోషిస్తుంది.
చక్కెర స్థాయిలను నియంత్రించగల కొన్ని సహజ ఆహారాలు ఉన్నాయి. వాటిలో జామ ఆకులు ఒకటి. మధుమేహాన్ని తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుందనే ప్రాచూర్యం వినిపిస్తుంది.
పరిశోధనల ప్రకారం.. జామ ఆకుల్లో కొన్ని అంశాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
2010లో న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్లో ఈ అధ్యయనం గురించి ప్రచురించారు. జామ ఆకుల టీ ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో, చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని తేలింది.
జామ ఆకులను తీసుకోవడానికి సులభమైన మార్గం ఏంటంటే.. తాజా ఆకులను నీటిలో మరిగించి టీ లాగా తాగవచ్చు. దీనిని గోరువెచ్చగా లేదా చల్లగా కూడా తీసుకోవచ్చు.
జపాన్ లాంటి దేశాల్లో ప్రజలు చాలా కాలంగా తమ ఆహారంలో జామ ఆకుల టీని తీసుకుంటున్నారు. అక్కడ దీన్ని మధుమేహం, ప్రీ-డయాబెటిస్ ఉన్న రోగులకు ఉపయోగకరంగా భావిస్తారు.
అయితే నిపుణులు కేవలం జామ ఆకులపై ఆధారపడటం సరికాదని భావిస్తున్నారు. మందులు, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడం.. ఇలా అన్ని విషయాలు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయని చెప్తున్నారు.