Foods for Kidney Health : ఈ ఫుడ్స్ కిడ్నీలను బలంగా చేస్తాయి.. మూత్రపిండాల ఆరోగ్యం కోసం తినేయండి
బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. వాపును తగ్గిస్తాయి. వాటిలో పొటాషియం, ఫాస్పరస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని మూత్రపిండాలకు సురక్షితమైనవిగా చెప్తారు.
ఆకుకూరలు ముఖ్యంగా క్యాలిఫ్లవర్ మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిలో విటమిన్ సి, విటమిన్ కె, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి మంచి ఎంపిక. క్యాబేజీలో ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయం చేస్తాయి.
వెల్లుల్లి, ఉల్లిపాయలు రెండూ మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఉప్పుకు బదులుగా రుచిని జోడించడానికి ఇవి గొప్ప మార్గంగా చెప్తారు.
సాల్మన్, టూనా, మేకెరెల్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాటీ ఆమ్లాలు వాపును తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అంతేకాకుండా చేపలలో అధిక-నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.
గుడ్డులోని తెల్లసొన కూడా మూత్రపిండాలకు ఒక అద్భుతమైన ప్రోటీన్ వనరు. ఇందులో అధిక-నాణ్యత కలిగిన ప్రోటీన్ ఉంటుంది. ఫాస్పరస్ తక్కువగా ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.