Coconut Water for Pregnant Women : ప్రెగ్నెన్సీ సమయంలో కొబ్బరి నీళ్లు తాగితే కలిగే లాభాలు ఏంటో తెలుసా?
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందుకే చాలామంది వీటిని రెగ్యులర్గా తీసుకుంటారు. మరి వీటితో (Image Source : Pexels)
ప్రెగ్నెన్సీ సమయంలో కొబ్బరి నీరు తాగితే ఆరోగ్యానికి చాలామంచిదట. దీనివల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది వారి ఆరోగ్యంతో పాటు పిండం అభివృద్ధికి హెల్ప్ చేస్తుంది. (Image Source : Pexels)
కొబ్బరి నీరు శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి పొటాషియం, సోడియం, మెగ్నీషియం అందుతాయి. (Image Source : Pexels)
గర్భధారణలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని పొటాషియం కడుపు ఉబ్బరంను తగ్గిస్తుంది. (Image Source : Pexels)
కొబ్బరి నీళ్లు శరీరానికి శక్తిని అందించి.. ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి. ఈ హైడ్రేటింగ్ లక్షణాలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. (Image Source : Pexels)
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.(Image Source : Pexels)