Bathing With Soap : రోజూ సబ్బుతో స్నానం చేస్తున్నారా? సోప్ ఎవరు ఎక్కువ వాడకపోతే మంచిదో తెలుసా?

సబ్బు రోజూ వాడితో లాభమా? నష్టమా?
సబ్బుతో స్నానం చేస్తే శరీరం శుభ్రమవుతుందని భావిస్తాము. కానీ రోజూ సబ్బుతో స్నానం చేయాలా? కానీ కొందరు సబ్బు వినియోగం తగ్గించుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు.
ప్రతిరోజూ స్నానం చేయడం మంచిదే అయినా.. శరీరమంతా సబ్బుతో రుద్దుకోవడం అందరికీ మంచిది కాదు. ముఖ్యంగా చర్మం పొడిగా ఉంటే సబ్బు వాడకం తగ్గిస్తే మంచిది.
వ్యాయామం చేసేవారు, ఎక్కువగా చెమట పట్టేవారు లేదా బయట ఎక్కువ సమయం గడిపేవారు సబ్బుతో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చెమట, దుమ్ము, వాసన తొలగుతాయి.
చంకలు, గజ్జలు, పాదాలు వంటి ప్రాంతాల్లో చెమట, బ్యాక్టీరియా ఎక్కువగా పేరుకుపోవచ్చు. ఈ ప్రాంతాలను సబ్బుతో శుభ్రం చేసుకోవడం మంచిది.
అయితే రోజూ ఎక్కువగా సబ్బు ఉపయోగించడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తొలగిపోయి చర్మం పొడిబారుతుంది. దీంతో దురద వంటి సమస్యలు రావచ్చు. డ్రై స్కిన్ ఉన్నవారు మైల్డ్ క్లెన్సర్ ఎంచుకోవచ్చు.
సబ్బుతో పాటు చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం చర్మాన్ని మరింత పొడిగా మార్చుతుంది. కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.
ఆయిలీ స్కిన్, చెమట ఎక్కువగా పట్టే చర్మం ఉన్నవారికి రోజువారీ క్లీనింగ్ అవసరం ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి సెన్సిటివ్ లేదా డ్రై స్కిన్ ఉన్నవారు సబ్బు ఎంపికలో జాగ్రత్త వహించాలి.
స్నానం చేసిన వెంటనే చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల పొడిబారకుండా కాపాడుకోవచ్చు. చర్మం తరచుగా దురద, ఎర్రగా మారడం వంటి సమస్యలు ఉంటే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.